Site icon vidhaatha

LSG vs MI|కొంప‌ముంచిన హార్ధిక్ పాండ్యా.. ముంబై పోరాటం ముగిసిన‌ట్టేనా..!

LSG vs MI| ఐపీఎల్ 2024 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. కొన్ని టీంలు 10 మ్యాచ్‌లు ఆడ‌గా, మ‌రికొన్ని 9 మ్యాచ్‌లు ఆడాయి. వీటితో ఎవ‌రెవ‌రు ప్లేఆఫ్స్‌కి వెళ‌తార‌నే క్లారిటీ వ‌చ్చింది.ఆర్ఆర్, కోల్‌క‌తా దాదాపు ప్లేఆఫ్స్‌కి చేరుకోగా, మిగ‌తా రెండు స్థానాల కోసం మిగ‌తా జ‌ట్ల పోటీ ప‌డుతున్నాయి. అయితే ముంబై వరుస ప‌రాజ‌యాల‌తో ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ నుండి త‌ప్పుకున్న‌ట్టే అంటున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన లో-స్కోరింగ్ గేమ్‌లో పేలవమైన బ్యాటింగ్ చేసి 4 వికెట్ల తేడాతో పరాజ‌యం చెందారు. దీంతో టేబుల్‌లో కింది నుండి రెండో స్థానంలో ఉన్నారు. ఇక గెలిచిన ల‌క్నో టీం పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి చేరింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్స్ క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ చేయ‌డంతో వారికి ప‌రుగులు రావ‌డం చాలా క‌ష్ట‌మైంది. నెహాల్ వధేరా(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), ఇషాన్ కిషన్(36 బంతుల్లో 3 ఫోర్లతో 32) ఓ మోస్త‌రు బ్యాటింగ్ చేయ‌గా .. టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.దీంతో ముంబై ఆ మాత్రమైన స్కోరు చేసింది. క్లిష్ట ప‌రిస్థితుల‌లో హార్దిక్ పాండ్యా డకౌటవ్వడం కావ‌డం కూడా ముంబై ఇండియ‌న్స్‌కి మైన‌స్ అయింది. ఆయ‌న ఔట్ మిగ‌తా బ్యాట్స్‌మెన్స్‌పై బాగా ఒత్తిడి తీసుకు వ‌చ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్(2/36) రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఇక 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కి ఆదిలోనే దెబ్బ త‌గిలింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అర్షిణ్ కులకర్ణి(0).. తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన మార్కస్ స్టోయినీస్‌తో కలిసి రాహుల్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. అయితే నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్‌(28)ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా చేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన దీపక్ హుడా(18) ఎక్కువ ప‌రుగులు రాబ‌ట్ట‌లేక‌పోయాడు. ఇక భారీ షాట్స్‌తో చెల‌రేగిపోతున్న స్టోయినీస్‌ను మహమ్మద్ నబీ క్యాచ్ ఔట్‌గా వెనక్కి పంపాడు. లక్నో విజయానికి 12 బంతుల్లో 13 పరుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో పాండ్యా వేసిన 19వ ఓవ‌ర్‌లో బ‌దోని ర‌నౌట్ అయ్యాడు. ఆ స‌మ‌యంలో మ్యాచ్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే నికోలస్ పూరన్ చివ‌రి వ‌ర‌కు ఉండి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Exit mobile version