Ms Dhoni| మాస్టర్ ప్లాన్ వేస్తున్న బీసీసీఐ.. టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కి ధోనీ రీఎంట్రీ..!

Ms Dhoni| గ‌త ఏడాది వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ తెస్తారు అనుకున్న భార‌త ఆట‌గాళ్లు పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైన‌ల్‌లో నిరుత్సాహ‌ప‌రిచా

  • Publish Date - April 25, 2024 / 07:31 PM IST

Ms Dhoni| గ‌త ఏడాది వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ తెస్తారు అనుకున్న భార‌త ఆట‌గాళ్లు పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైన‌ల్‌లో నిరుత్సాహ‌ప‌రిచారు. అయితే ఇప్పుడు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అయిన సాధించి తీరాల‌నే క‌సితో భార‌త ఆట‌గాళ్లు ఉన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం అంద‌రు ఐపీఎల్‌తో బిజీగా ఉండ‌గా, దీని త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. జూన్ 2 నుండి మొద‌లు కానున్న ఈ టోర్నీ అదే నెల 29తో ముగియ‌నుంది. అయితే ఈ సారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌ని విశ్వ‌విజేత‌గా నిలిపేందుకు బీసీసీ పెద్ద ప్ర‌ణాళిక‌లే రచిస్తుంది.ఈ క్ర‌మంలోనే బీసీసీఐ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకోనుందని తెలుస్తోంది.

భార‌త మాజీ కెప్టెన్, మిస్ట‌ర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని తిరిగి టీమిండియాతో చేర్చాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తుంది. అయితే ఇక్క‌డే అస‌లు ట్విస్ట్ ఉంది. ధోనిని ఆట‌గాడిగా కాకుండా మెంటార్‌గా బాధ్య‌త‌లు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడుఐపీఎల్‌లో దుమ్ము రేపుతున్న ధోని టీ20 వ‌రల్డ్ క‌ప్ కోసం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే అది అద‌న‌పు బ‌లంగా మారుతుంది. దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్‌‌లో టీమిండియాకు ధోనీ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించిన‌ప్ప‌టికీ దుర‌దృష్టం కొద్ది ఆ టోర్నీలో క‌నీసం సెమీఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ దశలొనే నిష్క్రమించింది.

మ‌రి ధోనీ తిరిగి మెంటార్ బాధ్యతలు తీసుకుంటాడా లేదా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు రాహుల్ ద్ర‌విడ్ కోచ్ బాధ్య‌త‌లు ముగిసిన త‌ర్వాత ధోనికే ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్టు కూడా ఒక టాక్ వినిపిస్తుంది. లేదు అంటే ద్రవిడ్ అనంతరం వీవీఎస్ లక్ష్మణ్‌‌‌ను కోచ్‌గా ఎంపిక చేసి ధోనీని ఓ పదవితో జట్టుతో కొనసాగించాల‌ని కూడా బీసీసీఐ ప్లాన చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. రానున్న రోజుల‌లో అయితే వీటిపై ఓ క్లారిటీ అయితే వ‌స్తుంది.

Latest News