న్యూఢీల్లీ : తొలిసారిగా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టుతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జట్టులోని ప్రతి క్రీడాకారిణితో మోదీ సంభాషించి..ప్రపంచ కప్ గెలవడంతో వారు పడిన శ్రమను..ఎదురైన అనుభవాలపై చర్చించారు. ఒక్కొక్క క్రీడాకారిణికి ప్రధాని పలు ప్రశ్నలు సంధించడంతో పాటు వారికి కూడా తనను ప్రశ్నించే అవకాశం కల్పించారు. ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పట్టిన ఫైనల్ బంతిని ఆమె జేబులో వేసుకోవడంపైన, అల్ రౌండర్ దీప్తీ శర్మ హనుమాన్ టాటూపైన మోదీ ప్రశ్నలు అడిగారు. సెమీఫైనల్ లో అసీస్ తో మ్యాచ్ లో జెమిమా రోడ్రిగ్స్ భావోద్వేగంపైన, రిచాఘోష్ బలమైన షాట్లపైన, షఫాలీ వర్మ ధనాధన్ బ్యాటింగ్, ఫైనల్ మ్యాచ్ లో బౌలింగ్ పైన ప్రధాని మోదీ ప్రశ్నలు సంధించి సరాదా సంభాషణాలు సాగించారు.
ఈ సందర్బంగా ప్లేయర్ హర్లీన్ డియోల్ ప్రధాని మోదీని.. మీ స్కిన్ ఎప్పుడు మెరుస్తు ఉంటుంది..దీని వెనుక రహస్యమెంటో మాకు చెప్పగలరా అంటూ ప్రశ్నించడంతో ప్రధాని మోదీ సహా అంతా నవ్వేశారు. నేను ఇటువంటి వాటి గురించి ఆలోచించనంటూ మోదీ చెప్పగా..జట్టు సభ్యుల్లో ఒకరు..దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే’ ఆయన స్కీన్ అలా మెరుస్తుందనగానే అంతా మరోసారి నవ్వేశారు. ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ సరదాగా స్పందిస్తూ ‘చూశారా సర్, ఇలాంటివారిని నేను డీల్ చేయాల్సి వచ్చింది. అందుకే, నా జుట్టు త్వరగా తెల్లబడిపోయింది’ అంటూ మరోసారి నవ్వించారు. మరో క్రీడాకారిణి అరుంధతి మాట్లాడుతూ మా అమ్మ మిమ్మల్నీ హీరోగా భావిస్తుందని..నేను మీమ్మల్ని కలిసే క్షణాల కోసం ఆమె ఆసక్తిగా నాలుగైదుసార్లు అడిగిందని భావోద్వేగానికి గురయ్యారు.
భేటీ సందర్భంగా ప్రధాని మోదీ భారత మహిళల జట్టుకు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు, స్నాక్స్ అందించారు. వీల్ చైర్ లో ఉన్న ప్రతీకాకు మోదీ స్వయంగా స్నాక్ అందించారు. అవి తనకు ఇష్టమేనా కాదా? అంటూ ప్రశ్నించడంతో క్రికెటర్లంతా చిరునవ్వులు చిందించారు. ప్రధానితో మోదీతో భేటీ అనంతరం భారత మహిళా జట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనుంది.
Modi ji knows the names of all the players and their favourite dishes.
Sabke naam to mujhe bhi nahi pata honestly 😭😭pic.twitter.com/f1qvsGYg9p
— desi mojito (@desimojito) November 6, 2025
