Rohit- Hardik| హార్ధిక్ పాండ్యాకి ముద్దు ఇచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. పుకార్ల‌న్నింటికి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టేనా?

Rohit- Hardik| ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని త‌ప్పించి హార్ధిక్ పాండ్యాని కెప్టెన్ చేయ‌డంతో హిట్ మ్యాన్ అభిమానులు ఎంత ర‌చ్చ చేశారో మ‌నం చూశాం. రోహిత్ నుంచి ఎలాంటి ఇన్‌పుట్ తీసుకోకుండా హార్దిక్ ని కెప్టెన్ చేయ‌డం ఏంట‌ని చాలా మంది మండి ప‌డ్డారు.

  • Publish Date - June 30, 2024 / 07:30 AM IST

Rohit- Hardik| ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని త‌ప్పించి హార్ధిక్ పాండ్యాని కెప్టెన్ చేయ‌డంతో హిట్ మ్యాన్ అభిమానులు ఎంత ర‌చ్చ చేశారో మ‌నం చూశాం. రోహిత్ నుంచి ఎలాంటి ఇన్‌పుట్ తీసుకోకుండా హార్దిక్ ని కెప్టెన్ చేయ‌డం ఏంట‌ని చాలా మంది మండి ప‌డ్డారు. స‌రే కెప్టెన్ చేశారు, కాని ఫీల్డ్ లో హార్ధిక్ పాండ్యా .. రోహిత్‌ని బౌండరీ లైన్‌లోకి పంపించి ఫీల్డింగ్ చేయించ‌డం, ఎక్క‌డ కూడా రోహిత్ ప్ర‌స్తావ‌న తీసుకురాక‌పోవ‌డంతో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అయ్యాయి. ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా ఉంద‌ని కూడా కొంద‌రు చెప్పుకొచ్చారు. టీ20 వరల్డ్‌ కప్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేయకూడదని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ గట్టిగా పట్టుబట్టాడని కూడా నెట్టింట ప్ర‌చారాలు సాగాయి.

సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ అగార్కర్‌ కూడా రోహిత్‌కు మద్దతు పలికిన కూడా భవిష్యత్‌ ప్రణాళికల్లో భాగంగా హార్దిక్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా చేయాలనుకొంటున్న బీసీసీఐ.. రోహిత్‌తో పాటు, అగార్కర్‌పై ఒత్తిడి తెచ్చి హార్దిక్‌ను జట్టులో చేర్చింద‌ని, అలా 15 మంది జట్టు సభ్యుల్లో పాండ్యాకు స్థానం దక్కడంతోపాటు వైస్‌ కెప్టెన్సీ లభించిందని టాక్ వినిపించింది.క‌ట్ చేస్తే టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది. జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో భార‌త్ .. ద‌క్షిణాఫ్రికాపై ఏడు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. భార‌త్ ఛాంపియ‌న్ గా నిలిచిన త‌ర్వాత‌ కెప్టెన్ రోహిత్ శర్మ , ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య కొన్ని ఎమోష‌న‌ల్ మూమెంట్స్ కెమెరాల‌లో రికార్డ్ అయ్యాయి.

హార్ధిక్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ అత‌ని చెంప‌పై ముద్దు పెట్టి హ‌గ్ చేసుకొని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇది చూశాక ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు తొల‌గిపోయాయని, టీమిండియాలో కూడా మంచి వాతావ‌ర‌ణం ఉంద‌ని కూడా కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ త‌ర్వాత హార్ధిక్ పాండ్యా, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ క‌న్నీళ్లు పెట్టుకున్నారు. నువ్వా నేనా అంటూ చాలా ట‌ఫ్‌గా జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం భార‌త్‌నే వ‌రించ‌డంతో వారు ఆనందభాష్పాలు కార్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Latest News