Rohit Sharma| హార్ధిక్ పాండ్యాకి చెక్ పెట్టేందుకు స‌రికొత్త స్కెచ్‌లు వేస్తున్న రోహిత్ శ‌ర్మ‌

Rohit Sharma| ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకి కెప్టెన్‌గా ఉండి ఐదు ట్రోఫీలు అందించి పెట్టిన రోహిత్ శ‌ర్మ‌ని ప‌క్క‌న పెట్టి హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వ‌డం ఎం

  • Publish Date - June 1, 2024 / 03:25 PM IST

Rohit Sharma| ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకి కెప్టెన్‌గా ఉండి ఐదు ట్రోఫీలు అందించి పెట్టిన రోహిత్ శ‌ర్మ‌ని ప‌క్క‌న పెట్టి హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వ‌డం ఎంత పెద్ద ర‌చ్చ‌గా మారిందో మ‌నం చూశాం. రోహిత్ శ‌ర్మ దీనిపై డైరెక్ట్‌గా ఏమి స్పందించ‌క‌పోయిన ఆయ‌న భార్య మాత్రం ఆవేద‌న బ‌య‌ట‌పెట్టింది.ఇక ఫ్యాన్స్ అయితే ఈ విష‌యంలో తెగ ర‌చ్చ చేశారు. హార్ధిక్ పాండ్యాని తెగ ట్రోల్ చేశారు. మ‌రోవైపు రోహిత్ శ‌ర్మ టీమిండియాలో అత‌నికి చోటు ద‌క్క‌కుండా చేయాల‌ని ఆలోచ‌న చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపించాయి. ఫామ్‌లో లేని హార్ధిక్‌కి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కి ఎంపిక చేయ‌డం, రోహిత్‌కి ఏ మాత్రం ఇష్టం లేద‌ట‌. కొంద‌రు పెద్ద‌ల వ‌ల‌నే అత‌నికి అవ‌కాశం ద‌క్కింద‌ని అంటున్నారు.

అయితే హార్ధిక్ పాండ్యాకి ఎలా అయిన చెక్ పెట్టాల‌ని రోహిత్ శర్మ స‌రికొత్త ప్రణాళిక‌లు ర‌చిస్తున్నాడు. వరల్డ్ కప్ వేటకు అమెరికాకు వెళ్లిన భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నారు. పరిస్థితులకు అలవాటు పడుతూ బ్యాటఇంగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మొదట ఫీల్డింగ్‌పై దృష్టి సారించారు. క్యాచ్ డ్రిల్స్ చేశారు. హై క్యాచ్‌లపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇక రోడ్డు ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డి తిరిగి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌తో రీఎంట్రీ ఇస్తున్న రిష‌బ్ పంత్ కూడా ప్రాక్టీస్ చేశాడు. పంత్, శాంస‌న్‌ల‌ని ఎంపిక చేసిన పంత్ ఎక్కువ‌గా సాధ‌న చేస్తూ నెట్స్‌లో కనిపించాడు. ఇక బుమ్రా, చాహల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం.

మ‌రోవైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా బ్యాటింగ్ సాధన చేశాడు. ఖలీల్ అహ్మద్, శివమ్ దూబె, కు‌ల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అవేశ్ ఖాన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించారు. అయితే శివ‌మ్ దూబేకి మాత్రం రోహిత్ ప్ర‌త్యేక స‌ల‌హాలు, సూచ‌న‌లు అందించాడు. ఎలాంటి లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయాలి, ఏ బాల్స్ వేయ‌కూడ‌ద‌ని సూచించాడు.. నిఖార్సయిన ఆల్‌రౌండర్‌‌గా దూబెను తీర్చిదిద్దాడానికి రోహిత్ కృషి చేస్తున్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్య స్థానంలో దూబెకు అవకాశం ఇవ్వాలని రోహిత్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వీడియోని చూసిన వారు అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే హార్దిక్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పర్యవేక్షణలో ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాడు. తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నాడు.

Latest News