Site icon vidhaatha

Shikhar Dhawan|షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న శిఖ‌ర్ ధావన్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

Shikhar Dhawan| టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కొంత కాలంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో క‌నిపించ‌డ‌మే మానేశాడు. కేవ‌లం ఐపీఎల్‌లో మాత్ర‌మే కనిపించి సంద‌డి చేస్తున్నాడు. అయితే ఈ రోజు ఉద‌యం గ‌బ్బ‌ర్ ఓ వీడియో విడుద‌ల చేస్తూ త‌న సోష‌ల్ మీడియా ద్వారా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 12 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు అండగా నిలిచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ), ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లకు శిఖర్ ధావన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.గత కొంతకాలంగా టీమిండియాకి దూరంగా ఉంటున్న 38 ఏళ్ల ధావన్ ఇంటర్నేషనల్ క్రికెెట్‌కి దూరమవుతున్నప్పటికీ ఐపీఎల్‌లో కొనసాగుతానని పేర్కొన్నాడు. చివ‌రిగా శిఖ‌ర్.. 2022, డిసెంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో భారత్ తరఫున ఆడాడు.

శిఖ‌ర్ ధావ‌న్ సుదీర్ఘ కెరీర్‌లో ధావన్ 269 మ్యాచ్‌లాడి 24 సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. మరీ ముఖ్యంగా వన్డేల్లో భారత బ్యాటింగ్ దిగ్గజాల్లో ఒకడిగా నిలుస్తూ అన్ని ఫార్మాట్లలో కలిపి 10,867 పరుగులు చేశాడు. అదే విధంగా 68 టీ 20లు ఆడిన శిఖర్ 1759 పరుగులు చేసాడు. 34 టెస్టులు ఆడి 2315 పరుగులు చేసిన శిఖర్ ఇక అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పారు. టీమిండియా తరఫున 2010లో ఎంట్రీ ఇచ్చాడు. విశాఖటపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచులో బరిలోకి దిగాడు. ధావన్ తన కెరీర్‌లో ఎక్కువగా ఓపెనింగ్ స్థానంలోనే బరిలోకి దిగాడు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20తో పొట్టి ఫార్మాట్‌లో కూడా అరంగేట్రం చేశాడు.

ఇక సుదీర్ఘ ఫార్మాట్‌లో 2013లో ఎంట్రీ ఇచ్చాడు. ధావన్ తన కెరీర్‌లో వన్డే, టెస్టు ఎంట్రీలు ఆస్ట్రేలియాతో మ్యాచులోనే ఇవ్వడం గమనార్హం. తన రిటైర్మెంట్ ప్రయాణంలో తనకు ఎంతో మంది.. సహాయం చేశారని…వారి వల్ల ఈ స్థాయికి వచ్చానని శిఖర్ ధావన్ తెలిపారు. దేశం తరఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఇక తనకు భవిష్యత్ అవకాశాల పైన నమ్మకం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధావన్ ఆడిన చివరి టీ20 ఇన్నింగ్స్‌ల్లో 52, 52, 46, 40 పరుగులు చేశాడు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ స్లో స్ట్రైక్ రేట్‌ను చూపిస్తూ టీమ్‌ నుంచి తప్పించింది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ తరఫున అత్యుత్తమ ఆటగాడిగా ధావన్ నిలిచాడు. 2015 ప్రపంచ‌కప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 51.5 సగటుతో 412 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Exit mobile version