Site icon vidhaatha

Women’s Cricket Asia Cup 2024 Finals | ఈసారి ఆసియాకప్​ విజేత శ్రీలంక

దంబుల్లాలో జరిగిన మహిళల ఆసియా కప్​ క్రికెట్​ ఫైనల్స్(Women’s Cricket Asia Cup 2024 Finals )​లో శ్రీలంక(Sri Lanks win over India) భారత్​పై ఘనవిజయం సాధించి తొలిసారి(First ever Asia Cup) ఆసియా కప్​ను ఎత్తుకుంది. గత ఆసియా కప్​(2022) ఫైనల్స్​లో భారత్​ చేతిలో ఘోరంగా ఓడిపోయిన శ్రీలంక ఇప్పుడు తిరుగులేని ప్రతీకారం తీర్చుకుంది. శ్రీలంక కెప్టెన్​ చమరి అటపట్టు(Chamari Athapaththu) పట్టుదల ముందు భారత్​ ఓడిపోయింది. టాస్​ గెలిచి బ్యాటింగ్​ తీసుకున్న భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది(India: 165/7 in 20 Overs). ప్రతిగా శ్రీలంక 2 వికెట్లు నష్టపోయి 18.4 ఓవర్లకు  167 పరుగులు చేసి విజయం సాధించింది(Sri Lanka: 167/2 in 18.4 Overs). అయిదు సార్లు ఫైనల్లో ఊరించి దక్కకుండా పోయిన కప్పు ఈసారి ఓళ్లో వాలడంతో శ్రీలంక ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఈ ఐదు సార్లు శ్రీలంక ఇండియా చేతిలోనే ఓడిపోవడం గమనార్హం(Sri Lanka Five times Runner-up).

బ్యాటింగ్​కు దిగిన ఇండియా, పరుగులు సాధించడానికి ఒకింత ఇబ్బందిపడింది. లేడీ సెహ్వాగ్​గా పేరుగాంచిన షపాలీవర్మ బ్యాటింగ్​లో తడబడి 16 పరుగులకే పెవిలయన్​ చేరింది. మరోపక్క స్మృతి బెదరకుండా తనదైన శైలిలో విరుచుకుపడి, పరుగులు రాబట్టింది. పవర్​ప్లేలో 44 పరుగులు మాత్రమే రాబట్టిన ఇండియా, 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. ఉమా చెత్రీ, కెప్టెన్​ హర్మన్​ప్రీత్​లు తక్కువ స్కోరుకే అవుట్​ కాగా, మళ్లీ జెమీమా రోడ్రిగ్స్​(29), రిచా ఘోష్​(30) పోరాడి భారత్​కు గౌరవప్రదమైన స్కోరును అందించారు. తుదకు నిర్ణీత 20 ఓవర్లలో భారత్​ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (Smriti Madhana)47 బంతుల్లో 10 ఫోర్లతో 60 పరుగులు సాధించి వరుసగా రెండో అర్థసెంచరీ చేయడం గమనార్హం.

ఎలాగైన ఈసారి కప్​ కొట్టాలని కసితో బ్యాటింగ్​కు వచ్చిన శ్రీలంక బ్యాటర్లకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ విశ్మి గుణరత్నే 7 పరుగులకే రనౌట్​ అయింది. కానీ, పట్టుదలకు మారుపేరైన శ్రీలంక కెప్టెన్​ చమరి ఆటపట్టు గట్టిగా నిర్ణయించుకున్నట్లు ధాటిగా ఆడింది. పవర్​ప్లే ముగిసేసరికి భారత్​ లాగే 44 పరుగులు చేసిన లంకేయులు, 10 ఓవర్లకు మాత్రం అదే ఒక వికెట్​కు 80 పరుగులు చేసింది. కెప్టెన్​ చమరి విధ్వంసానికి హర్షిత సమరవిక్రమ(Harshitha Samarawickrama) సుడిగాలి బ్యాటింగ్​ తోడై, లక్ష్యాన్ని ఉఫ్​మంటూ ఊదేసారు. గమ్యం చేతుల్లోకి వచ్చాక, చమరి(43 బంతుల్లో 61 పరుగులు: 2 సిక్స్​లు, 9 ఫోర్లు) అవుటయినా, మిగిలిన లాంఛనాన్ని దిల్హరి తోడుతో హర్షిత(51 బంతుల్లో 69: 2 సిక్స్​లు, 5 ఫోర్లు) విజయవంతంగా పూర్తిచేసి, శ్రీలంకకు తొలి ఆసియాకప్​ను అందించింది. శ్రీలంక ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదు. ఆ బాధ్యత ఇండియా బౌలర్లు, ఫీల్డర్లు తీసుకున్నారు. పస లేని బౌలింగ్​, చెత్త ఫీల్డింగ్​తో శ్రీలంకకు అదనపు బ్యాటర్లుగా నిలిచారు.

2004లో ప్రారంభమైన మహిళల ఆసియా కప్​, నాలుగుసార్లు వన్డే ఫార్మాట్​లో సాగగా, అయిదుసార్లు టి20 ఫార్మాట్​లో నడిచింది. మొత్తం తొమ్మిదిసార్లు ఈ పోటీలు జరగగా, అత్యధికంగా ఏడుసార్లు భారత్​ విజేతగా నిలిచింది. 2018లో బంగ్లాదేశ్​ గెలవగా, ఇప్పుడు శ్రీలంక గెలిచింది.

 

Exit mobile version