హోం గ్రౌండ్‌లో రెచ్చిపోయిన స‌న్‌రైజ‌ర్స్… సీఎం రేవంత్ రెడ్డితో క‌లిసి వెంకీ మామ సంద‌డి

  • Publish Date - April 6, 2024 / 06:54 AM IST

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపుతుంది. చెన్నై లాంటి టీమ్‌ని కూడా మ‌ట్టిక‌రిపించింది. ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు చెన్నైపై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు స‌మిష్టిగా రాణించ‌డంతో హైద‌రాబాద్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వెంకీ మామ తెగ సంద‌డి చేశాడు. సీఎం రేవంత్ రెడ్డి ప‌క్కనే కూర్చొని అంద‌రిని అల‌రించాడు.. సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూసేందుకు రాగా, ఆయ‌న స్క్రీన్‌పై క‌నిపించ‌గానే స్టేడియం హోరెత్తిపోయింది. ఇక ఈ మ్యాచ్‌కి మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఉప్ప‌ల్ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. శివమ్ దూబే(24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45), అజింక్యా రహానే(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 35), ర‌వీంద్ర జ‌డేజా ( 23 బంతుల్లో 31) మాత్ర‌ మే కాస్త విలువైన ప‌రుగులు చేశారు.మిగతావారెవ‌రు కూడా పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్, షెహ్‌బాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాత్కత్ ట‌ఫ్ బౌలింగ్ చేసి తలో వికెట్ తీసారు. అయితే చెన్నైకి ప‌రుగులు రాబ‌ట్ట‌డం చాలా క‌ష్టంగా మారింది.

ఇక ల‌క్ష్య చేధ‌న‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయం అందుకుంది. ముఖ్యంగా ఎయిడెన్ మార్క్‌రమ్‌(36 బంతుల్లో 50)తో పాటు ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), అభిషేక్ శర్మ(12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37) మెరుపులు మెరిపించ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు సునాయాసంగా విజ‌యం సాధించింది. . చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, మహీష్ తీక్షణ తలో వికెట్ తీయగా.. మోయిన్ అలీ రెండు వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు ఈ సీజ‌న్‌లో దూసుకుపోతుంది. పెద్ద పెద్ద జ‌ట్ల‌ని కూడా మ‌ట్టిక‌రిపిస్తూ మంచి విజ‌యాలు సాధిస్తుంది. ఈ సారి ఈ జ‌ట్టు ఫినాలేకి చేరుకున్నా కూఆ ఆశ్చర్య‌పోన‌క్క‌ర్లేద‌ని అంటున్నారు.

 

Latest News