T20 World cup PAK vs USA సూపర్ ఓవర్ థ్రిల్లర్ … పాకిస్తాన్ పై అమెరికా సంచలన విజయం

ఘన చరిత్ర గల పాకిస్తాన్​ను పసికూన అమెరికా గడగడ వణికించింది, తిప్పికొడితే 30 మ్యాచ్​ల అనుభవం లేని అమెరికా 242 మ్యాచ్​ల పాక్​ వైభవాన్ని పాతరేసింది. తొలుత బౌలింగ్​తోనూ, తర్వాత బ్యాటింగ్​తోనూ తడబాటు లేకుండా ఆడి యుఎస్​ఏ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆఖరి బంతికి మ్యాచ్​ను టైగా ముగించిన అమెరికా సూపర్​ ఓవర్​కు తెరతీసింది

  • Publish Date - June 7, 2024 / 01:48 AM IST

టెక్సాస్ ​:  పురుషుల టి20 ప్రపంచకప్​ క్రికెట్​ పోటీలలో భాగంగా నేడు టెక్సాస్​లో జరిగిన మ్యాచ్​లో జగజ్జేత పాకిస్తాన్​, పసికూన అమెరికా తలపడగా, యుఎస్​ఏ పెను సంచలన విజయం నమోదు చేసింది.  సూపర్​ ఓవర్​ థ్రిల్లర్​లో  టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న అమెరికా మేటి వీరులైన పాకిస్తాన్​ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించింది. అమెరికా బౌలర్ల ధాటికి అసలు బ్యాటింగ్​ ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితికి పాకిస్తాన్​ చేరుకుంది. నిప్పులాంటి బంతులకు పాక్​ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఒకరి వెనుక మరొకరు పెవిలియన్​కు క్యూ కట్టారు. ఓపెనర్లలో బాబ్​ ఆజమ్​ (44) ఒక్కడే ఆచితూచి ఆడుతూ టి20ని టెస్ట్​మ్యాచ్​లా మార్చేసాడు. పవర్​ప్లేలో పాకిస్తాన్​ స్కోరు 30 పరుగులకు 3 వికెట్లంటే అమెరికా బౌలర్లు ఎలా వణికించారో అర్థం చేసుకోవచ్చు. ఇక  మిగతావారంతా అలా వచ్చి ఇలా వెళ్లినవారే. రిజ్వాన్​(9), ఉస్మాన్​ఖాన్​(3), ఫఖర్​ జమాన్​(11), ఆజంఖాన్​(0)లు 20 పరుగులు కూడా చేయకుండా వెనుదిరిగారు. వంద పరుగులు కూడా కష్టమనుకున్న స్థితిలో వచ్చిన షాదాబ్​ ఖాన్​(25 బంతుల్లో 40 పరుగులు) ఎడాపెడా బాదడంతో జట్టు స్కోరు వంద దాటింది. అఖర్లో అఫ్రిదీ బ్యాట్​ ఝళిపించడంతో పాకిస్తాన్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది. అమెరికా బౌలర్లలో కెంజిగే 3 వికెట్లతో రాణించగా, సౌరభ్​ నేత్రావల్కర్​ 2, అలీ ఖాన్​, జస్​దీప్​సింగ్​ చెరో వికెట్​ తీసుకున్నారు. రిజ్వాన్​ ఇచ్చిన క్యాచ్​ను స్లిప్​లో స్టీవెన్​ టేలర్​ ఒంటి చేత్తో అందుకున్న తీరు నిజంగా షాకింగ్​. బహుశా టోర్నమెంట్​కే హైలైట్​.

తరువాత చేజింగ్​కు దిగిన అమెరికా ఏమాత్రం తడబాటు లేకుండా ధాటిగా బ్యాటింగ్​ ఆరంభించింది. పూర్తిగా పాక్​ ఆటతీరుకు భిన్నంగా యధేచ్చగా చెలరేగారు. భీకర బౌలర్లయిన అఫ్రిదీ, నసీంషా, హారిస్​ రౌఫ్​లను ఎదుర్కుంటూ వారు పరుగులు రాబట్టిన తీరు అద్భుతం. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్​ మోనాంక్​ పటేల్​, స్టీవెన్​ టేలర్​(12)లు తొలి వికెట్​కు 36 పరుగులు జోడించగా, తర్వాత వచ్చిన ఆండ్రీస్​ గౌస్(35)​తో కలిసి మోనాంక్​ ఇన్నింగ్స్​ను బలంగా నిర్మించాడు. ఈ క్రమంలో అర్థసెంచరీ సాధించిన మోనాంక్​(50) మహమ్మద్​ ఆమిర్ బౌలింగ్​లో ఔటవ్వగా, తొలి మ్యాచ్​లో దంచికొట్టిన ఆరొన్​ జోన్స్(36)​, నితీశ్​ కుమార్​(14)లు మరో వికెట్​ పడకుండా సరిగ్గా 159 పరుగులు చేసారు. దాంతో సూపర్​ ఓవర్లోకి అడుగుపెట్టింది.

పాక్​ బౌలర్లలో ఆమిర్​, నసీం షా, ఆఫ్రిదీ తలా ఒక వికెట్​ తీసారు.

 

సూపర్​ ఓవర్​ – 1:

అమెరికా బ్యాటర్లు: ఆరొన్​ జోన్స్​, హర్మీత్​సింగ్​. పాకిస్తాన్​ బౌలర్​: మహమ్మద్​ ఆమిర్​.

మొదట బ్యాటింగ్​ చేసిన అమెరికా, మహమ్మద్​ ఆమిర్​ బౌలింగ్​లో వరుసగా, 4,2,1, 1+వైడ్​, 1, 1+వైడ్​, 2, 3+వైడ్​, 1+ఔట్​. ఇలా మొత్తం ఒక వికెట్​ నష్టానికి 18 పరుగులు చేసింది. 3 వైడ్లతో కలిపి ఆమిర్​ మొత్తం 9 బంతులేసాడు. పాకిస్తాన్​ లక్ష్యం 6 బంతుల్లో 19 పరుగులు.

సూపర్​ ఓవర్​ – 2:

పాకిస్తాన్​ బ్యాటర్లు: ఫఖర్​ జమాన్​​, ఇఫ్తికార్​ అహ్మద్​​. అమెరికన్​​ బౌలర్​: సౌరభ్​ నేత్రావల్కర్​

తర్వాత బ్యాటింగ్​ చేసిన పాకిస్తాన్​, వరుసగా, 0, 4, వైడ్​, 0ఔట్​, వైడ్, 4ఎల్​బీ, 2, 1. మొత్తం ఒక వికెట్​ నష్టానికి 13 పరుగులు.

ఫలితం: సూపర్​ ఓవర్లో పాకిస్తాన్​పై అమెరికా​ ఘనవిజయం

Read more 

T20 World Cup | ఈ వరల్డ్‌ కప్‌లో బద్దలవనున్న రెండు రికార్డులు..! ఒకటి జయవర్ధనేది.. మరొకటి కోహ్లీదే..!

T20 World Cup | టీమిండియాను కలవరపరిచేది ఆ ఒక్కటే..? ఆ సమస్యను అధిగమిస్తే కప్‌ మనదే..!

Rohit Sharma| హార్ధిక్ పాండ్యాకి చెక్ పెట్టేందుకు స‌రికొత్త స్కెచ్‌లు వేస్తున్న రోహిత్ శ‌ర్మ‌

T20 World Cup| ఈ దిగ్గ‌జ క్రికెట‌ర్స్‌కి ఇదే చివ‌రి వ‌ర‌ల్డ్ క‌ప్.. ఆ లిస్ట్‌లో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..!

Latest News