T20 World Cup | ఈ వరల్డ్‌ కప్‌లో బద్దలవనున్న రెండు రికార్డులు..! ఒకటి జయవర్ధనేది.. మరొకటి కోహ్లీదే..!

T20 World Cup | జూన్‌ 2 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ మొదలవనున్నది. ఈ మెగా టోర్నీకి వెస్టిండిస్‌తో కలిసి తొలిసారిగా అగ్రరాజ్యం అమెరికా సైతం ఆతిథ్యం ఇస్తున్నది. ఐసీసీ మెగా ఈవెంట్‌లో తొలిసారిగా 20 జట్లు బరిలోకి దిగబోతున్నాయి. 2007లో మొదలైన టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ..

T20 World Cup | జూన్‌ 2 నుంచి టీ20 వరల్డ్‌ కప్‌ మొదలవనున్నది. ఈ మెగా టోర్నీకి వెస్టిండిస్‌తో కలిసి తొలిసారిగా అగ్రరాజ్యం అమెరికా సైతం ఆతిథ్యం ఇస్తున్నది. ఐసీసీ మెగా ఈవెంట్‌లో తొలిసారిగా 20 జట్లు బరిలోకి దిగబోతున్నాయి. 2007లో మొదలైన టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ.. ఈ ఏడాది జరుగుతున్న ప్రపంచకప్‌తో ఎనిమిదో ఎడిషన్‌ కావడం విశేషం. అయితే, ఐసీసీ ప్రారంభించిన తొలి ఎడిషన్‌లోనే మహేంద్ర సింగ్‌ నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ చెరో రెండు సార్లు విజేతగా నిలిచాయి. ఆ తర్వాత పాక్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఒక్కోసారి వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను సాధించాయి.

తాజాగా జరుతున్న వరల్డ్‌ కప్‌లో అరుదైన రికార్డులో బద్దలై నయా రికార్డులు నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. విరాట్‌ కోహ్లీ, మహేలా జయవర్ధనే రికార్డులు సైతం ప్రపంచకప్‌లో బద్దలయ్యే అవశాలున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌లో అత్యధికంగా ఫోర్లు బాధిత రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేలా జయవర్ధనే పేరిట ఉన్నది. జయవర్ధనే పొట్టి కప్‌లో 111 బౌండరీలు బాధాడు. అయితే, ఈ రికార్డును విరాట్‌ కోహ్లీ బ్రేక్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లీ 103 బౌండర్లీ సాధించగా.. జయవర్ధనే రికార్డుకు తొమ్మిది బౌండరీల దూరంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత రోహిత్‌ శర్మ (91), డేవిడ్‌ వార్నర్‌ (86) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఇక టీ20 వరల్డ్‌ కప్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఘనత కోహ్లీ పేరిట ఉన్నది. 2014, 2022 వరల్డ్‌ కప్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఓ టీ20 కప్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు విరాట్‌ పేరిట ఉన్నది. 2014లో 319 పరుగులు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రికార్డు అలాగే కొనసాగుతుండగా.. ఈ సారి మాత్రం రికార్డు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో పాల్గొనే జట్లు గరిష్ఠంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. మ్యాచ్‌లు ఎక్కువగా ఉండడంతో ఈ రికార్డు సైతం బ్రేక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రికార్డును బ్రేక్‌ చేసిన ఘనతను ఏ ఆటగాడు సాధిస్తాడో వేచి చూడాల్సిందే.