Site icon vidhaatha

RR vs GT|ర‌షీద్ ఖాన్ థ్రిల్లింగ్ బ్యాటింగ్.. టైట్ మ్యాచ్‌లో చివ‌రి బంతికి గెలిచిన గుజ‌రాత్

RR vs GT| ఐపీఎల్ సీజ‌న్ 17లో ప్ర‌తి మ్యాచ్ థ్రిల్లింగ్‌గానే సాగుతుంది. చివరి వర‌కు విజేత ఎవ‌ర‌నేది చెప్ప‌డం క‌ష్టంగా మారుతుంది. బుధవారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. రషీద్ ఖాన్ సంచలన బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాన్నందుకుంది గుజ‌రాత్ సేన‌. కుల్దీప్ సేన్ 19వ ఓవర్‌లో 20 పరుగులు ఇవ్వ‌డంతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓట‌మి చ‌వి చూడాల్సి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన థ్రిల్లింగ్ పోరులో గుజరాత్ చివరి బంతికి విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 ), సంజూ శాంసన్(38 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్) అద్భుత‌మైన ఆట‌తీరుతో మ‌రోసారి జ‌ట్టు భారీ స్కోరు చేయ‌డంలో భాగం అయ్యారు.

ఈ మ్యాచ్‌లో య‌శ‌స్వి జైస్వాల్, బ‌ట్ల‌ర్ నిరాశ‌ప‌రిచారు. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీసారు. ఇక 197 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్ర‌మంలో గిల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చివ‌రి బంతికి విజ‌యాన్ని సాధించింది. చివ‌రి బంతికి 2 ప‌రుగులు కావ‌ల్సి ఉండ‌గా, రషీద్ ఖాన్ బౌండరీ కొట్టి టైటాన్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు. శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72) హాఫ్ సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) కాస్త రాణించాడు. ఇక చివర్లో రాహుల్ తెవాటియా(20 నాటౌట్), రషీద్ ఖాన్( 11 బంతుల్లో 24 నాటౌట్, 4 ఫోర్లు ) మెరుపులు మెరిపించ‌డంతో రాజ‌స్థాన్‌కి ఓట‌మి త‌ప్ప‌లేదు.

చారు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఇదే తొలి పరాజయం. గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్ శుభారంభాన్ని అందిస్తూ తొలి వికెట్‌కి 64 ప‌రుగులు చేశారు. అయితే కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ వికెట్ల ముందు దొరికపోయాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మాథ్యూ వేడ్(4), అభినవ్ మనోహర్(1)లను కుల్దీప్ సేన్ ఔట్ చేసి పెవీలియ‌న్ పంపాడు. ఇక విజ‌య్ శంక‌ర్ మ‌రోసారి మ్యాచ్‌లో నిరాశ‌ప‌రిచాడు. శుభ్‌మన్‌ గిల్‌ (72) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడంతో గుజ‌రాత్ జ‌ట్టు విజ‌యం సాధించ‌గ‌లిగింది. రాజస్థాన్‌ బౌలర్లలో కుల్దీప్‌ సేన్‌ 3, చాహల్‌ 2 వికెట్లు తీశారు.

Exit mobile version