Saurabh Netravalkar | సౌరభ్​ నేత్రావల్కర్​ భార్య ఎవరో తెలుసా?

అమెరికా క్రికెట్​ జట్టులో సంచలనాల బౌలర్​ సౌరభ్​ నేత్రావల్కర్​. భారత్​తో మ్యాచ్​లో రోహిత్​ శర్మ, విరాట్ కోహ్లీల వికెట్లు తీసి గడగడ వణికించిన స్పీడ్​స్టర్​. ఇంతకీ ఈ పిలగాడిది భారతే. ప్రాపర్​ ముంబయి. మన ఆటగాళ్లందరూ తనకి పరిచయమే. కొందరితో కలిసి భారత్​ తరపున క్రికెట్​ ఆడాడు కూడా. ఇతని భార్య కూడా భారత అమ్మాయే. పేరు దేవీ స్నిగ్ధ ముప్పాల.

ముంబైలో జన్మించిన అమెరికా క్రికెటర్​ సౌరభ్​ నేత్రావల్కర్​(Saurabh Netravalkar)  టి20 ప్రపంచకప్​ పోటీ(T20 Cricket World Cup)ల వల్ల ఈ మధ్య వార్తల్లో బాగా నిలిచాడు.  గొప్పగా బతకాలన్న అమెరికా కలలను, గొప్ప క్రికెటర్​ కావాలన్న భారత స్వప్నాలను ఏకకాలంలో సాకారం చేసుకుంటున్న అరుదైన వ్యక్తి సౌరభ్​. నేత్రావల్కర్​ భార్య గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సో.. పదండి కలుసుకుందాం.. దేవీ స్నిగ్ధ ముప్పాల(Devi Snigdha Muppala)… అదేనండీ, సౌరభ్​ సతీమణి. ఇంతకీ ఈ అమ్మాయి మన తెలుగమ్మాయే. వీళ్ల తాతలు ఆంధ్రప్రదేశ్​కు చెందినవారు. అందుకే ముప్పాల స్నిగ్ధాదేవి.

సౌరభ్ ముంబైలోని సర్దార్ పటేల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివి, ఆ తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేసాడు. యుఎస్​ఏ జట్టుకు ప్రొఫెషనల్ క్రికెటర్‌గానే కాకుండా, అతను ఒరాకిల్‌(Oracle)లో ప్రిన్సిపల్ ఇంజనీర్‌(Principal Engineer)గా పని చేస్తున్నాడు. అచ్చం అతనిలాగే, అతని భార్య దేవి స్నిగ్ధ ముప్పాలా కూడా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసింది. ఆమె కూడా ఒరాకిల్‌లో ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్‌(Principal Application Engineer)గా పనిచేస్తోంది.

అన్నట్లు స్నిగ్ధ పేరొందిన కథక్​ నృత్య కళాకారిణి(Kathak Dancer). తను ప్రోగ్రాంలు ఇవ్వడమే కాదు, కథక్​ నేర్పుతుంది కూడా. నృత్యం పట్ల తనకున్న అమితమైన ఇష్టాన్ని ఒక బాలీవుడ్​ ప్రేరేపిత ఫిట్​నెస్​ ప్రొగ్రాం ‘బాలీ ఎక్స్’(Bolly X)​గా మొదలుపెట్టి సాన్​ఫ్రాన్సిస్కో, బే ఏరియాలో ఎన్నో ఏళ్లుగా చాలా పేరుపొందింది. ఒకసారి ఏబిసి టివి ప్రోగ్రాం ‘షార్క్​ట్యాంక్’(Shark Tank)​లో బాలీ ఎక్స్​ గురించి రావడంతో స్నిగ్థ చాలా ఫేమస్​ అయింది. తను దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.   ఇద్దరు భార్యాభర్తలు విభిన్న అభిరుచులు, భిన్న వృత్తులలో అద్భుతంగా రాణిస్తూ, ఒకేలా ఉండటం చాలా అరుదు కదా.. ఇది నిజానికి ఒక స్ఫూర్తివంతమైన జంట కథ.

ముంబై వాసి అయిన సౌరభ్​, తెలుగమ్మాయి అయిన స్నిగ్థలు 2020లో వివాహం చేసుకున్నారు. వారి వివాహం ఉత్తర, దక్షిణ భారత సంస్కృతులు మేలికలయికలా జరిగిందని వారి పెళ్లి ఫోటోలు చూస్తే తెలుస్తుంది. వీళ్లిద్దరూ కేవలం టెకీలే కాదు, ఇద్దరికీ సొంతంగా భిన్న అభిరుచులు, వ్యక్తిత్వాలు, విజయాలు ఉన్నా, జంటగా వారి బంధం కూడా చాలా ధృఢంగా ఉంది. ఇదే వారి కలలు, లక్ష్యాలు వేరైనా ఒకరికొకరు అందించుకునే సహకారానికి, ప్రేమకు నిదర్శనం. స్నిగ్ధ నృత్య ప్రదర్శనలకు సౌరభ్​, సౌరభ్​ ఆడే క్రికెట్​ మ్యాచ్​లకు స్నిగ్ధ వెళుతుంటారు ఒకరినొకరు ఎంకరేజ్​ చేయడానికి. అయితే ఇద్దరికీ కామన్​గా ఉన్న ఇష్టం – ప్రయాణాలు. ట్రావెల్​ అంటే ఇద్దరికీ ఎంతో ఇష్టం. వెకేషన్​ దొరికితే ఇద్దరూ ఎటన్నా బయల్దేరతారు.

ఇది ఒ అరుదైన జంట కథ. ఏ జంటైనా ఇలాగే ఉండాలనే స్ఫూర్తినిచ్చే నిజం. ఉన్నతస్థాయిలో, భిన్న వృత్తులు, ప్రవృత్తులతో ఉండే జంటలు కలిసిఉండలేవు అనే అభిప్రాయాన్ని సమూలంగా తుడిచివేసిన ఈ దంపతుల జీవితం ఖచ్చితంగా ఆదర్శమే.

 

Latest News