విధాత : ఉమెన్స్ వరల్డ్ కప్(Womens World Cup) విజేతల జట్టు టీమిండియా మహిళా క్రికెటర్లు శ్రీ చరణి(Sri Charani), అరుంధతి రెడ్డి(Arundhati Reddy)లకు తెలుగు రాష్ట్రల(TeluguStates) ప్రజలు, ప్రభుత్వాలు బ్రహ్మరథం పట్టాయి. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న మహిళా క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణికి మంత్రులు అనిత, సంధ్యారాణి, ఎంపీ కేశినేని చిన్ని, క్రికెటర్ మిథాలీ రాజ్ లు స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం శ్రీచరణి సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిశారు.
ఇటు తెలంగాణలో ప్లేయర్ అరుంధతి రెడ్డికి క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీసీ, ఎండి సోని బాలదేవి, కోచ్ ఆకాష్ తదితరులు ఉన్నారు.
