Site icon vidhaatha

Earth 2.0 | భూమికి వెలుపల నీటి ఛాయలు.. నాసా అధికారిక ప్రకటన.. రెండో ‘భూమి’ ఎక్కడంటే!

Earth 2.0 | ఈ అనంత విశ్వంలో నీటి ఛాయలు ఉన్నాయి. అది అంగాకుడి మీదనో, ఏదో యూట్యూబ్‌ వీడియోలో ప్రత్యక్షమైన గజిబిజిగా కనిపించే ఫుటేజ్‌లోనో కాదు! అలాగని మనకు సమీపాన ఉన్న చంద్రుడిపైనా కాదు. ఈసారి నాసా అధికారికంగా ప్రకటించింది. ఈ విశ్వాంతరాలలో మరో చోట మంచులా ఘనీభవించిపోయిన స్థితిలో నీరు ఉందని స్పష్టం చేసింది. జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ఈ నీటిని జాడలను గుర్తించిందని అధికారికంగా ప్రకటన చేసింది. మన సౌర కుటుంబానికి పూర్తిగా అవతల, వేరే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న గ్రహంపై నీటి మంచును గుర్తించిందని తెలిపింది.

ఇప్పటి వరకూ మనం మన భూమి అత్యంత ప్రత్యేకమైనదని భావిస్తున్నాం. కానీ.. కొత్త గ్రహాలు ఏర్పడుతున్న నక్షత్ర వ్యవస్థలో కనుగొన్న స్ఫటికాకార నీటి మంచు.. భూమి మనం అనుకున్నంత ప్రత్యేకమైనది కాకపోవచ్చన్న అభిప్రాయాన్ని రేకెత్తిస్తున్నది. భూమి లక్షల కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్య లో తిరుగుతన్న జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌.. పీడీఎస్‌ 70 అని పిలుస్తున్న యువ నక్షత్ర వ్యవస్థమీద తన ఇన్‌ఫ్రారెడ్‌ విజన్‌తో కన్నేసింది. ఇది 370 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది.

నక్షత్రం నుండి వచ్చే కాంతి దాని చుట్టూ ఉన్న ఒక పెద్ద, ధూళి వలయంతో ఎలా సంకర్షణ చెందుతుందో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. వారు కనుగొన్నది స్ఫటికాకార నీటి మంచు యొక్క స్పష్టమైన రసాయన సంతకం. ఆవిరి కాదు. అంచనాలు కాదు. ఘనమైన, నిర్మాణాత్మకమైన, ఘనీభవించిన నీరు. ఆ నక్షత్రం నుంచి వెలువడే కాంతి దాని చుట్టూ ఉన్న భారీ దుమ్ముతో కూడిన వలయంతో ఎలా ఇంటరాక్ట్‌ అవుతున్నదో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. దానిలో వారికి తేలిదేంటంటే.. అదొక ఘనీభవించిన నీటి మంచు అని. అది తుంపర కాదని, కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటి తుంపర అంటే.. సాధారణమైనదే. వెలుపలి గ్రహాలపై దీనిని గతంలో కనుగొన్నారు. చంద్రుడిపై నీడ ఉండే ప్రాంతాల్లో, అంగారకుడిపై, బుధ గ్రహంపై కూడా మంచును కనుగొన్నప్పటికీ.. వీటితో పోల్చితే తాజగా కనుగొన్నది పూర్తిగా భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటువంటి వాటర్‌ ఐస్‌ను, అందులోనూ ఇంత పెద్ద మొత్తంలో కొత్త గ్రహాలు ఏర్పడుతున్న చోట కనుగొనడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. భవిష్యత్తులో భూమిలాంటి ప్రపంచాల నిర్మాణంలో ఇది భాగం కావచ్చని చెబుతున్నారు.

మరి గ్రహాంతర వాసుల సంగతేంటి?

ఈ అన్వేషణలో ఇప్పటి వరకూ భూమికి వెలుపల జీవం ఉన్న విషయాన్ని రుజువు కాలేదు. అయితే.. జీవం ఉండే అవకాశాలను ఇది పెంచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నీరే ప్రతి జీవానికి మూలం. ఇప్పుడు కనుగొన్న యువ నక్షత్రాల సౌర వ్యవస్థల్లో నీరు ఉందంటే.. అక్కడ జీవం అరుదైన అంశం కాకపోవచ్చని అంటున్నారు. భూమిపై నీరు ఉండటానికి మంచు తోకచుక్కలు, లేదా గ్రహశకలాలు కారణమనే భావన ఉన్నది. అదే నిజమైతే.. భూమిపై ఇటువంటి వాతావరణానికి, జీవరాసులకు కారణమైన నీరు.. అక్కడ కూడా అదే చేస్తుందని అంటున్నారు.

మరిన్ని ఆసక్తికర వార్తలు

El Ejido | ‘ఎల్‌ డొరాడో’.. ది లాస్ట్‌ సిటీ ఆఫ్‌ గోల్డ్‌.. మరి ‘ఎల్‌ ఎజిడో’ ఏంటో తెలుసా? ఆకాశం నుంచి కనిపించే ఏకైక మానవ కట్టడం!
Rift in East Africa | ఆఫ్రికా రెండు ముక్కలు.. ఆరో మహా సముద్రం ఆవిర్భావం?
cricket stadium in forest | ఆ క్రికెట్ మైదానం అమెజాన్ అడవుల్లోనే ఉందా? నిజం తెలిస్తే నివ్వెరపోతారు!
Fight with Brothers | కల్వకుంట్ల కవిత.. మరో వైఎస్‌ షర్మిల అవుతారా?

 

Exit mobile version