Site icon vidhaatha

140నువ్వుల గింజలపై తెలంగాణ రాష్ట్ర గీతం

విధాత : తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయహే తెలంగాణను 140 నువ్వుల గింజలపై ఆవిష్కరించి అద్భుతం సృష్టించాడు సూక్ష్మ కళాకారుడు ప్రదీప్‌కుమార్‌. అల్వాల్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు ప్రదీప్ కుమార్ సూక్ష్మ కళా రూపాల ఆవిష్కరణలో ప్రపంచ స్థాయిలో ఇప్పటికే పది ప్రపంచ రికార్డులు సాధించి పురస్కారాలు అందుకున్నాడు. వృత్తిరిత్యా స్వర్ణకారుడిగా ఉన్న ప్రదీప్‌కుమార్‌ పన్నెండేళ్లుగా మైక్రో ఆర్టిస్టుగా అద్భుత ఆవిష్కరణలు సృష్టించిన క్రమంలో పండుగలు. ప్రత్యేక దినాలు, సందేశాత్మక అంశాలపై పలు సృజనాత్మక ఆవిష్కరణలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంలోనూ రావి ఆకుపై ఆయన ముఖ చిత్రాన్ని గీశారు. అయితే ఆ రావి ఆకును సీఎం రేవంత్‌రెడ్డికి బహుకరించే అవకాశం మాత్రం ఇప్పటికైతే రాలేదని చెప్పారు.

 

 

Exit mobile version