గొర్ల మేకల పెంపకందారుల అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేయాలి: MP బడుగుల

విధాత‌: జాతీయ గొర్ల మేకల పెంపకం దారుల అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను కలిసి వినతిపత్రం అందజేశారు. లైవ్ స్టాక్, అగ్రీకల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ బృందంతో కలిసి గొర్ల మేకల, రైతుల సమస్యలపై, నేషనల్ బోర్డు ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో బడుగుల చర్చించారు. భారతదేశంలో దాదాపుగా 3.756 కోట్ల కుటుంబాలు […]

  • Publish Date - December 21, 2022 / 05:11 PM IST

విధాత‌: జాతీయ గొర్ల మేకల పెంపకం దారుల అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ, డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను కలిసి వినతిపత్రం అందజేశారు.

లైవ్ స్టాక్, అగ్రీకల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ బృందంతో కలిసి గొర్ల మేకల, రైతుల సమస్యలపై, నేషనల్ బోర్డు ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో బడుగుల చర్చించారు. భారతదేశంలో దాదాపుగా 3.756 కోట్ల కుటుంబాలు ప్రత్యక్షంగా గొర్రెలు, మేకలు కాస్తూ ఉపాధి పొందుతున్నారన్నారని, రైతులే కాకుండా మటన్, ఉన్ని మొదలగు పనులలో దాదాపుగా 10 కోట్ల మంది ప్రజలకు పైగా మన దేశంలో ఉపాధి పొందుతున్నారన్నారని బడుగుల కేంద్ర మంత్రి కి వివరించారు. అంతేకాకుండా మన దేశం నుండి దాదాపుగా 30 దేశాలకు గొర్ల, మేకల మాంసం ఎగుమతి అవుతుందని, తద్వారా విదేశీ మాదకద్రవ్యం లభిస్తుందన్నారు.

గొర్రెల, మేకల సంఖ్యాపరంగా ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్న మన దేశం, గొర్ల, మేకల ఉత్పాదకతలో మాత్రం వెనుకంజలో ఉన్నదన్నారు. అంతేకాకుండా గొర్రెల, మేకల అభివృద్ధికి జాతుల మీద విస్తృతమైన పరిశోధన జరగాల్సి ఉందన్నారు.

ప్రస్తుతమున్న పరిస్థితులలో మన దేశంలో కొన్ని కృషి విజ్ఞాన కేంద్రాలలో, వ్యవసాయ, పశు సంవర్ధక యూనివర్సిటీల పరిధిలో తప్పిస్తే, ఈ విషయంపై చర్చ కానీ పరిశోధన గాని పెద్దగా జరగడం లేదన్నారు. గొర్రెల, మేకల అభివృద్ధి పని విస్తృతమైన పరిధిని కూడా మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.

పెంపకం దార్లు ఎన్నో ఏండ్లుగా సాంప్రదాయకంగా వస్తున్న బ్రీడ్ (Breed ) అభివృద్ధి పద్ధతులు మాత్రమే పాటిస్తున్నారని కేంద్ర మంత్రి కి వివరించారు. డెయిరీ, పౌల్ట్రీ రంగాలలో విస్తృత పరిశోధనలు జరిగినట్లుగా గొర్రెలు మేకల బ్రీడ్ (breed ) అభివృద్ధి మీద జరగలేదని ఆవేదన వ్యక్తంచే శారు. దీంతో మన దేశంలో గొర్రెలు , మేకల రైతులు మందలతో వలస(Migration) వెళ్తున్నారన్నారు.

ఇప్పటికైనా భారత ప్రభుత్వం గొర్రెల, మేకల అభివృద్ధి పైన విస్తృత పరిశోధనలు చేసి, కొత్త బ్రీడ్స్ (Breeds ) అభివృద్ధి చేయాల్సిన దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త బ్రీడ్ లను అభివృద్ధి చేయడం వలన, గొర్రెలు మేకల రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెంది, ప్రజలకు నాణ్యమైన మాంసం దొరుకుతుందని, అంతేకాకుండా ఆదాయం పెరిగి దేశ ఆర్థిక రంగం కూడా బలోపేతం అవుతుంద‌న్నారు.

అదేవిధంగా మన దేశంలో దాదాపుగా 3.756 కోట్ల గొర్ల మేకల రైతులు అసంఘటితంగా ఉన్నారని, వారందరిని సంఘటితం చేసి, ఒకే గొడుగు కిందకు తీసుకు వఛ్చి, భారత ప్రభుత్వం వారి అభివృద్ధికి దోహదం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గొర్రెల, మేకల ఎరువు వలన వ్యవసాయానికి కూడా ఏంతో మేలు జరుగుతుందని, రసాయన ఎరువుల వాడకం తగ్గించి, భూములకు జీవం పోయవచ్చన్నారు.

పశువులు, వ్యవసాయ పరిశోధన సంస్థలు వివిధ రాష్ట్రాలలో వివిధ అంశాలపై చేసిన అధ్యయనం, పర్యటనలలో ఎక్కడ కూడా గొర్ల, మేకల జాతుల అభివృద్ధి, ఉత్పాదకత పెంచే పనులపై రీసెర్చ్, అభివృద్ధి చేయడానికి “జాతీయ గొర్ల మేకల అభివృద్ధి సంస్థ” ( National sheep and goat Development Board ) ఏర్పాటు చేయాల్సిన అవసరంవుందని బడుగుల కేంద్ర మంత్రి కి ఏకరువు పెట్టారు.

కార్యక్రమంలో లైవ్ స్టాక్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ బృందం నేషనల్ కన్వీనర్ బి.రామచంద్రుదు, కోకన్వీనర్ గోసుల శ్రీనివాస్ యాదవ్, జాతీయ సమన్వయకర్తలు లోడంగి గోవర్ధన్(తెలంగాణ), మనీష్ మండల్ ( బీహార్) , శానోజే ( UP ), యస్వంత్ రావు (మహారాష్ట్ర), దేవరప్ప (కర్ణాటక), అజిత్ మరియు ఇలంగో ( South India coordinator తమిళనాడు), శ్రీనివాస్ రావు (ఆంధ్ర ప్రదేశ్) , రాహుల్ ( జమ్మూ కాశ్మీర్ ), బొట్టు చంద్రన్ (ఒడిస్సా) , జై హింద్ యాదవ్ ( మధ్య ప్రదేశ్) పాల్గొన్నారు.