Site icon vidhaatha

SANDEEP KISHAN | హీరో సందీప్ కిషన్ హోటల్‌పై కేసు నమోదు

విధాత, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నిర్వాహణ భాగస్వామిగా ఉన్న వివాహ భోజనంబు హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో నాసిరకం పదార్థాలను గుర్తించి హోటల్‌పై కేసు కూడా నమోదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ లోని వివాహ భోజనంబు హోటల్లో జూలై 8వ తేదీన తనిఖీ చేశారు. “చిట్టి ముత్యాలు బియ్యం (25 కిలోలు) 2022 నాటికి డేట్ అయిపోయిన బ్యాగ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే సింథటిక్ ఫుడ్ కలర్ 500 గ్రాముల కొబ్బరి తురుము కనుగొనబడింది. స్టీల్ కంటైనర్ లలో నిల్వ చేసిన ముడి ఆహార వస్తువులు, పాక్షికంగా తయారు చేసిన ఆహారాలకు సైతం మూతలు లేకుండా అపరిశుభ్రంగా ఉన్నాయని, వంటగది ఆవరణలోని కాలువలలో మురికి నీరు ఉందని, ఆహార తయారీలో ఉపయోగించే నీరు కూడా పరిశుభ్రంగా లేనట్లు గమనించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.

Exit mobile version