Site icon vidhaatha

Danam Nagender | ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు

విధాత : ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తోపాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. రోడ్ నెంబర్ 69 నందగిరి హిల్స్ లో జిహెచ్ఎంసీ ప్రహరీ గోడను కొందరు కూల్చివేశారు. గురుబ్రహ్మ నగర్ కి చెందిన గోపాల నాయక్, రామచందర్ సహా మరికొందరు ఎమ్మెల్యే దానం సమక్షంలోనే ప్రహరీ కూల్చివేశారని జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్ మెంట్ ఇంచార్జి పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఎమ్మెల్యే దానంను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version