Hyderabad | తమ్ముడి పెళ్లి ఒక తీపి జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశంతో ఓ హైదరాబాదీ హెలికాప్టర్( Helicopter )ను అద్దెకు తీసుకున్నాడు. పెళ్లి( Marriage )కి సంబంధించిన ప్రతి చిన్న అంశం, విషయం కూడా తీపి గుర్తుగా ఉండాలనే ఆకాంక్షతో తమ్ముడి పెళ్లి చేశాడు. హైదరాబాద్( Hyderabad )లో పెళ్లి చేసి, పుణె( Pune )లో బరాత్ నిర్వహించారు. అంతే కాదు.. పుణెలోని గణపతి ఆలయం( Ganapathi Temple ) చుట్టూ హెలికాప్టర్‌లో తిరుగుతూ పూల వర్షం కురిపించారు. మరి ఆ హైదరాబాదీ ఎవరంటే మెహిదీపట్నంకు చెందిన మధు యాదవ్( Madhu Yadav ).
ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మధు యాదవ్ మాట్లాడుతూ.. నా పెళ్లి ఒక తీపి గుర్తుగా ఉండేలా చేసుకుందామనుకున్నాను. కానీ సమయం లేక వీలు కాలేదు. ఇక తమ్ముడి పెళ్లైనా తీపి జ్ఞాపకంగా ఉండాలనే ఉద్దేశంతో నెల రోజుల పాటు హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాను. పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న అంశం, విషయం కూడా తీపి గుర్తుగా ఉండాలనే ఆకాంక్షతో తమ్ముడి పెళ్లి చేశాను. పెళ్లి కార్డులను హెలికాప్టర్‌లో తిరుగుతూ పంచాము. పెళ్లి మండపంలో ల్యాండింగ్‌కు ప్రయత్నించాం. కానీ మిలటరీ, డిఫెన్స్ అనుమతి ఇవ్వకపోడంతో అది సాధ్యం కాలేదు. ఎందుకంటే మెహిదీపట్నం( Mehidipatnam ) డిఫెన్స్ ఏరియా ఉంది కాబట్టి అనుమతి లభించలేదు.
అందుకే పుణెలో పూలవర్షం..
పుణెలో 150 సంవత్సరాల చరిత్ర గల గణపతి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ అంటే తనకు సెంటిమెంట్. ఆ దేవుడి దయ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి ఆ టెంపుల్‌కు వెళ్తుంటాను. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని తనకు అన్ని రాష్ట్రాల్లో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాను అంటే ఆ గణపతి దేవుడి ఆశీర్వాదం వల్లే. అందుకే తమ్ముడికి పెళ్లి నేపథ్యంలో పుణెకు హెలికాప్టర్‌లో వెళ్లి ఆ ఆలయం చుట్టూ పూల వర్షం కురిపించాను. బరాత్ కూడా అక్కడే నిర్వహించాము.
తమ్ముడిని కొడుకులాగా చూస్తా..
తమ్ముడిని తమ్ముడి లాగా చూస్తే ప్రేమ ఉండదు.. తమ్ముడిని కొడుకులాగా చూస్తే ప్రేమ ఉంటుంది. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడమే కాదు.. దేవుడి దయ ఉంటే కొనొచ్చు కూడా. తాతల నుంచి కొనసాగుతున్న పాల బిజినెస్‌ను వదులుకోలేదు. బీటెక్ పూర్తి చేసి ఇతర బిజినెస్‌లు చేసినప్పటికీ.. పాల వ్యాపారం మంచి లాభాలున్న బిజినెస్.. గ్రౌండ్ లెవల్‌లో ఉన్న సమస్యలను క్లియర్ చేసుకుంటే.. కష్టపడితే లాభాలు తప్పకుండా ఉంటాయి. మిల్క్ బిజినెస్‌తో పాటు లిక్కర్ బిజినెస్ కూడా ఉంది. బార్ అండ్ రెస్టారెంట్స్, వైన్స్ ఉన్నాయి. 800ల వరకు బర్రెలు ఉన్నాయి. ఆవులు కూడా ఉన్నాయి. సూపర్ డెయిరీ ఫామ్( Super Dairy Farm ) మీద మా బిజినెస్ కొనసాగుతోంది. ఈ డెయిరీకి వందేండ్ల చరిత్ర ఉంది. 14 ఎకరాల్లో ఈ డెయిరీ ఫామ్ ఉంది.
కరాచీ, పిస్తా, నిలోఫర్‌కు మా పాలే సరఫరా..
800 బర్రెల్లో కేవలం 300 బర్రెలు మాత్రమే పాలు ఇస్తాయి. కరాచీ( Karachi ), పిస్తా( Pista ), నిలోఫర్( Niloufer ) వంటి సెంటర్లకు మా డెయిరీ నుంచే పాలను సరఫరా చేస్తున్నాం. 5 వేల లీటర్లు రోజుకు ఉత్పత్తి అయితే.. కౌంటర్ మీద కేవలం 1500 లీటర్లు మాత్రమే విక్రయిస్తాం. మిగతావన్నీ కార్పొరేట్ సప్లయి చేస్తాం. 200 రకాల స్వాన్స్ ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన కుక్కలు ఉన్నాయి. 100 రకాల గొర్రె పోటెళ్లు ఉన్నాయి. మేకలు ఉన్నాయి అని మధు యాదవ్ చెప్పుకొచ్చారు.
అన్నను తండ్రిలాగే భావిస్తాను..
మా అన్నను తండ్రిలాగానే భావిస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఏ అన్న కూడా ఏ తమ్ముడికి ఈ విధంగా చేయలేదు అని మధు యాదవ్ సోదరుడు తెలిపాడు.