Site icon vidhaatha

Janhvi Kapoor | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్‌

విధాత, హైదరాబాద్ : సినీ నటి జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

జాన్వీ తన తల్లి దివంగత అందాల తార శ్రీదేవి జయంతి రోజున శ్రీవారిని దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినీమాలో హీరోయిన్‌గా తెలుగు సినిమాల్లోకి జాన్వీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల ఎన్టీఆర్‌, జాన్వీలపై చిత్రీకరించిన చుట్టమల్లే పాట సినీ అభిమానుల విశేష ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జాన్వీల కేమిస్ట్రీ బాగుందన్న కామెంట్లు జోరందుకున్నాయి. దేవర హిట్‌తో జాన్వీ తెలుగులో తన సత్తా చాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version