తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు

తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం వాస్తు మార్పులు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి రాకపోకలకు సంబంధించి వాస్తు మార్పులు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టకా తొలిసారిగా సచివాలయంలో వాస్తు మార్పులు చేశారు

  • Publish Date - June 3, 2024 / 04:52 PM IST

విధాత : తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం వాస్తు మార్పులు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి రాకపోకలకు సంబంధించి వాస్తు మార్పులు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టకా తొలిసారిగా సచివాలయంలో వాస్తు మార్పులు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ఇప్పటివరకు ప్రధాన గేటు నుంచి సచివాలయం లోనికి వెళ్లేది. వాస్తు మార్పుల్లో భాగంగా ఇక నుంచి వెస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్ సచివాలయంలోకి వెళ్లనుంది. అలాగే నార్త్‌ ఈస్ట్ గేట్ నుంచి సీఎం కాన్వాయ్‌ బయటకు వెళ్లనుంది. సౌత్, ఈస్ట్ గేట్‌ల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్‌, ఉన్నతాధికారుల రాకపోకలు కొనసాగనున్నాయి. గతంలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి గాంధీ భవన్‌లోనూ పలు వాస్తు మార్పులు చేయించారు. గాంధీభవన్ వాస్తు మార్పులు కలిసి రాగా ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అదే నమ్మకంతో సచివాలయం వాస్తులోనూ రేవంత్ రెడ్డి మార్పులు చేశారు.

Latest News