Site icon vidhaatha

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు

విధాత:తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియమించారు.టీ.టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితోపాటు పలువురి పేర్లలను పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. అయితే, రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబర్చారు. వ్యక్తిగత కారణాలతో పదవి స్వీకరించడానికి నిరాకరించారు.దీంతో బక్కని నరసింహులు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపింది.టీడీపీ తరుపున షాద్ నగర్ నియోజకవర్గం నుంచి 1994లో బక్కని నరసింహులు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.కాగా, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ ఇటీవల ఆపార్టీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Exit mobile version