హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరానికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( GHMC )) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో పోస్టర్లు( Posters ), బ్యానర్లు( banners ), కటౌట్ల( Cutouts )పై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. వాల్ పోస్టర్లు( Wall Posters ), వాల్ రైటింగ్స్( Wall Writings ) పై కూడా జీహెచ్ఎంసీ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ
