Barrelakka | లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇండిపెండెంట్‌గా నామినేషన్‌

Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల బరిలో కూడా దిగారు. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. ఎలాంటి హడావిడి లేకుండా మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు.

  • Publish Date - April 24, 2024 / 06:30 AM IST

Barrelakka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల బరిలో కూడా దిగారు. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆమె ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. ఎలాంటి హడావిడి లేకుండా మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు.

డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియోతో శిరీష ఫేమస్‌ అయ్యారు. దాంతో ఆమె బర్రెలక్కగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో నిరుద్యోగ సమస్యపై తన గొంతు వినిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

అప్పుడు ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీ మద్దతు లభించింది. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతోపాటు ప్రశంసలు కురిపించారు. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క ఓటమి పాలయినప్పటికీ నైతికంగా గెలిచారు. మొత్తం 5,754 ఓట్లు సాధించి నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నిలిచారు. ఓటమి అనంతరం బర్రెలక్క మాట్లాడుతూ.. తాను డబ్బులు పంచకున్నా ప్రజలు నిజాయితీగా ఓట్లు వేశారని, నైతికంగా తానే గెలిచినట్లు భావిస్తున్నానని ప్రకటించారు.

ప్రజా సమస్యలపై తప పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని బర్రెలక్క అప్పట్లో చెప్పారు. అప్పుడు చెప్పినట్టుగానే ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచి మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించబోతున్నారు. ఈ ఎన్నికల్లో బర్రెలక్క కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎంపీ మల్లు రవిని.. బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్​ఎంపీ పోతుగంటి రాములు కొడుకు పోతుగంటి భరత్​ప్రసాద్‌ను.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి​ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్‌ను​ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు.

Latest News