విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో కొల్లాపూర్‌లో పోటీ చేసి గుర్తింపు సాధించిన యూ ట్యూబర్ బర్రెలక్క పార్లమెంటు ఎన్నికల బరిలోనూ పోటీకి దిగింది. అయితే ఈసారి ఆమె నాగర్ కర్నూల్ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో పోటీ చేయనుంది. మంగళవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి బర్రెలక్క నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పోటీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. 5754 ఓట్లు సాధించి ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. తాజాగా లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థినిగా పోటీకి సిద్ధమైంది. ఇటీవలే తన సమీప బంధువు వెంకటేశ్‌ను పెళ్లి చేసుకున్న బర్రెలక్క ఎంపీ ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది.
ఈసారి నాగర్ కర్నూల్‌లో ఎంపీగా బర్రెలక్క పోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో కొల్లాపూర్‌లో పోటీ చేసి గుర్తింపు సాధించిన యూ ట్యూబర్ బర్రెలక్క పార్లమెంటు ఎన్నికల బరిలోనూ పోటీకి దిగింది. అయితే ఈసారి ఆమె నాగర్ కర్నూల్ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో పోటీ చేయనుంది

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు