BC reservations| బీసీ రిజర్వేషన్లపై బిగ్ ట్విస్టు… సుప్రీంలో కేవీయట్ పిటిషన్!

బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సవాల్ చేసిన పిటిషనర్లు..తాజాగా సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేస్తే.. తమ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు ముందస్తుగా ఎస్.ఎల్.పీ దాఖలు చేశారు.

విధాత, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల(BC reservations) వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను సవాల్ చేసిన పిటిషనర్లు..తాజాగా సుప్రీంకోర్టులో కేవీయట్(Supreme Court caveat) పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్(Telangana Government Appeal)   దాఖలు చేస్తే.. తమ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు ముందస్తుగా ఎస్.ఎల్.పీ దాఖలు చేశారు.

ఇప్పటికే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లు 50శాతం మించరాదన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ..స్టే జారీ చేసింది. ప్రభుత్వానికి కౌంటర్ దాఖలుకు 4వారాల గడువు, పిటిషనర్ల సమాధానానికి మరో 2వారాల గడువు విధించి..విచారణను 6వారాల పాటు వాయిదా వేసింది. హైకోర్టు స్టేతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసుకుంది.

అయితే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు..బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పించే లక్ష్యంతో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే…తమ వాదన వినాలంటూ పిటిషనర్లు కేటీయట్ దాఖలు చేయడం విశేషం.

నేడు బీసీ సంఘాల కీలక సమావేశం

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు శుక్రవారం బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన బీసీ సంఘాల సమావేశం కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యానగర్ లో బీసీ భవన్ లో సమావేశం ప్రారంభం కానుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ జీవోపై హైకోర్టు స్టే విధించడంపై చర్చించి..న్యాయ పరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలను తీసుకోవడంపై ఈ భేటీలో బీసీ సంఘం నాయకులు చర్చిస్తారు. హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో బీసీ సంఘం నాయకులు ఉన్నట్లుగా తెలుస్తుంది.