రాములోరి పెళ్లిలో భద్రాచలం పెన్షనర్స్ ప్రసాద వితరణలు

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కదంబం, వడపప్పు, , పానకం, తాటి ముంజలు, చల్లటి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు విస్తృతంగా భక్తులకు పంపిణీ చేశారు. రిటైర్డ్ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, ఐటీసీ, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సేవలు అందించారు.

భద్రాచలంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసిపోయింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులు సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా భద్రాచలం డివిజన్ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు విస్తృతంగా ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సంఘం డివిజన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వర్రావు నాయకత్వంలో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కదంబం, వడపప్పు, , పానకం, తాటి ముంజలు, చల్లటి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటి ప్యాకెట్లు విస్తృతంగా భక్తులకు పంపిణీ చేశారు. రిటైర్డ్ ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, ఐటీసీ, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సేవలు అందించారు.

విశ్రాంతి ఏర్పాట్లు

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టెంట్లు ఏర్పాటు చేసి భక్తులు సేదతీరేలా సౌకర్యాలు కల్పించారు. ఈ సేవలను చూసి యాత్రికులు స్వచ్ఛంద సంస్థల పనితీరును ప్రశంసించారు. ప్రసాద వితరణకు ముందు స్వామివారి కళ్యాణ ఫోటోకు పూలదండలు వేసి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు చారుగుళ్ల నాగేశ్వర్రావు, బందు వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు కలిసి పుచ్చకాయ ముక్కల పంపిణీతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రముఖుడు టీ ధనేశ్వర్రావు చేతుల మీదుగా పానకం, వడపప్పు పంపిణీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కె.ఎస్.ఎల్.వి ప్రసాద్ (ప్రధాన కార్యదర్శి), డి. కృష్ణమూర్తి (కోశాధికారి), ఎం.వి.ఎస్. నారాయణ, టి. ముత్తయ్య (ఆర్టీసీ), ఎస్. అజయ్ కుమార్ (ఐటీసీ), ఎం. హరినాథ్, పి. కోటేశ్వరరావు, మాదిరెడ్డి రామ్మోహనరావు, రాజబాబు, చంద్రసుబ్బయ్య చౌదరితోపాటు.. మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులు ఇలాంటి సేవలు చేయడం అభినందనీయమని యాత్రికులు కొనియాడారు. భద్రాచలం కీర్తిని దేశవ్యాప్తంగా నిలబెడుతున్నాయని ప్రశంసించారు.

Latest News