Telangana Heavy Rains : తెలంగాణకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్!

తెలంగాణలో మార్చి 29 వరకు వర్షాలు కురిసే అవకాశం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఈదురుగాలులు వీచే అవకాశంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు.

Telangana Yellow Alert

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 29 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ‘ఎల్లో అలర్ట్’ జారీ చేస్తూ ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ లకు వర్ష సూచన చేసింది. అలాగే హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వర్ష ప్రభావం కనిపించనుందని పేర్కొంది.

ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి :

వైభవంగా అయోధ్య, భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు
Ram Charan | చ‌ర‌ణ్ గొప్ప‌త‌నంపై జానీ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్ .. 2వేల మందికి ఇన్సూరెన్స్ చేయించారు..

Latest News