విధాత : నేను, ప్రధాని నరేంద్ర మోదీ చేతల మనుషులం అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ మాట చాలామందికి వర్తించదన్నారు. భారత్‌తో బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
పశ్చిమాసియా ఉద్రికతలతో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న తరుణంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్చలు ఆసక్తి రేపాయి. రెండురోజుల క్రితం ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ చేసి.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకత పైనా వారు చర్చించినట్లు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తమ సంభాషణపై మోదీ సైతం స్పందిస్తూ..వీలైనంత త్వరగా యుద్ద ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లుగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Samsung | ఆరేళ్ల ఓఎస్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో.. శాంసంగ్ A సిరీస్‌లో రెండు మిడ్ రేంజ్ ఫోన్లు.. !
వాణిజ్య గ్యాస్ సరఫరాపై కేంద్రం గుడ్ న్యూస్
