Samsung | ఆరేళ్ల ఓఎస్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో.. శాంసంగ్ A సిరీస్‌లో రెండు మిడ్ రేంజ్ ఫోన్లు.. !

Samsung | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ A సిరీస్ నుంచి మరో రెండు కొత్త ఫోన్లను విడదుల చేసింది. Samsung Galaxy A57 5G, Samsung Galaxy A37 5G మొబైళ్లను అధికారికంగా ప్రకటించింది.

Samsung | ఆరేళ్ల ఓఎస్, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో.. శాంసంగ్ A సిరీస్‌లో రెండు మిడ్ రేంజ్ ఫోన్లు.. !

Samsung | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ A సిరీస్ నుంచి మరో రెండు కొత్త ఫోన్లను విడదుల చేసింది. Samsung Galaxy A57 5G, Samsung Galaxy A37 5G మొబైళ్లను అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ అధునాతన ఏఐ ఫీచర్లతో పాటు మెరుగైన కెమెరా, పనితీరు. సెక్యూరిటితో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకునే విధంగా వీటిని శాంసంగ్ కంపెనీ రూపొందించింది.

ఏఐ ఫీచర్లే హైలెట్

Samsung Galaxy A57 5G, Samsung Galaxy A37 5G రెండు ఫోన్లలోనూ Awesome Intelligence పేరుతో ఏఐ టెక్నాలజీని అందజేశారు. ఈ సాంకేతికతతో

* వాయిస్ రికార్డింగ్‌లను textగా మార్చుకోవచ్చు
* AI Select ద్వారా స్క్రీన్‌పై ఉన్న కంటెంట్‌ను సులభంగా ఎడిట్ చేయవచ్చు
* Object Eraser ద్వారా ఫొటోల్లో మనకు అవసరం లేని ఆబ్జెక్ట్స్‌ను తొలగించవచ్చు
* Circle to Search ఫీచర్ ద్వారా ఇమేజ్‌లోని ఏదైనా వస్తువుపై మార్క్ చేసి దాని గురించి సెర్చ్ చేయవచ్చు.
* Awesome Intelligence తో పాటు Bixby, Gemini వంటి ఏఐ అసిస్టెంట్లు కూడా సపోర్టు అందిస్తాయి.

కెమెరా పనితీరు

ఈ రెండు మోడళ్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. గెలాక్సీ A57లో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 5 మెగా పిక్సెల్ మాక్రో లైన్స్‌లు కలవు. గెలాక్సీ A37లో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 5 మెగా పిక్సెల్ మాక్రో లైన్స్‌లు కలవు. నైట్ మోడ్‌లో కూడా క్లియర్ ఫొటోలు తీసుకునేలా Nightography ఫీచర్‌ను మరింత పెరుగుపరిచారు. అదనంగా Galaxy A57 మోడల్‌లో Advanced Image Processing అందించారు. ఇక ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరాను ఇచ్చారు.

బ్యాటరీ

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 5000mAh బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఫుల్ చార్జి చేస్తే రెండు రోజుల వరకు బ్యాకప్ వస్తుంది. ఇక ఈ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లోనే 60 శాతం చార్జింగ్ నిండుతుంది. మెరుగైన CPU, GPU, NPU పనితీరు ఉంది. అలాగే గేమింగ్ కోసం పెద్ద వేపర్ చాంబర్ కూడా జోడించారు. దీంతో మల్టీ టాస్కింగ్, స్ట్రీమింగ్ కోసం ఈ ఫోన్లు స్మూత్ అనుభవాన్ని ఇస్తాయి.

డిస్‌ప్లే

* రెండు మొబైళ్లు కూడా 6.7 FHD+ Supe AMOLED డిస్‌ప్లేతో వస్తున్నాయి.
* 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను అందిస్తున్నాయి. దీంతోపాటు ఆరుబయట కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా విజన్ బూస్టర్ ఫీచర్ కూడా అందించారు.
* IP68 రేటింగ్‌తో దుమ్ము, నీటి నుంచి రక్షణ కలిగిస్తాయి.
* ఈ రెండు కూడా స్లిమ్ బెజెల్స్, ప్రీమియం డిజైన్లలో వస్తున్నాయి.

ఆపరేటింగ్ సిస్టమ్

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 ఆధారిత OneUI8.5పై పనిచేస్తాయి. వీటికి ఆరు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తున్నాయి. అలాగే Samsung Knox సెక్యూరిటీ, Private Album, Private Alerts వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ధర ఎంతంటే..

శాంసంగ్ గెలాక్సీ A57 మొబైల్ రెండు వేరియంట్లలో వస్తుంది. 8జీబీ ర్యామ్+256 స్టోరేజి మొబైల్ ధరను రూ.58,999గా నిర్ణయించారు. ఈ మొబైల్‌పై రూ.2వేలు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజి మొబైల్ ధరను రూ.62,999గా నిర్ణయించారు. దీనిపై రూ.500 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A37 మొబైల్ మూడు వేరియంట్లలో వస్తుంది. 8జీబీ ర్యామ్+128 స్టోరేజి మొబైల్ ధరను రూ.45,999గా నిర్ణయించారు. ఈ మొబైల్‌పై రూ.4వేలు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. 8జీబీ ర్యామ్+256 స్టోరేజి మొబైల్ ధరను రూ.49,999గా నిర్ణయించారు. దీనిపై రూ.2500 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజి మొబైల్ ధరను రూ.53,999గా నిర్ణయించారు. దీనిపై రూ.1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొబైల్‌లు ఏప్రిల్ 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.

Read More:

శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. యూత్ నుంచి యమ క్రేజ్!

శాంసంగ్‌ ఫోన్లలో యాపిల్ Airdrop!.. ఇక ఆండ్రాయిడ్ మొబైళ్ల నుంచి ఐఫోన్లకు షేరింగ్ మరింత ఈజీ!