వైభవంగా అయోధ్య, భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు

అయోధ్య, భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కల్యాణం, సూర్యతిలకం భక్తులను ఆకట్టుకున్నాయి.

Sri rama navami

విధాత : దేశ వ్యాప్తంగా ఊరువాడ శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రామాలయాలు శ్రీరామ నవమి సందర్బంగా సీతారాముల పెళ్లి వేడుకల సందడితో శోభిల్లాయి. ప్రజలు పెద్ద ఎత్తున సీతారాముల పెళ్లి వేడుకలను తిలకించి పులకరించారు. దేశంలోని సుప్రసిద్ద అయోధ్య రామాలయంలో శ్రీ రామనవమి వేడకులు ఆధ్యంతం భక్తి ప్రపత్తులతో కొనసాగాయి. అభిజిత్ లగ్ర మూహుర్తంలో బాలరాముడికి సూర్యతిలకం దిద్దిన ఘటనను వీక్షించిన భక్తజనం జై శ్రీరామ్ నినాదాలతో పరవశించారు. శ్రీరామ నవమి సందర్భంగా బాలరాముడిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు. సాయంత్రం సరయూ నది ఒడ్డున గంగాహారతీ, లక్షన్నర దీపారాధన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

భద్రాచలంలో వైభంగా సీతారాముల కల్యాణం

దక్షిణ అయోధ్యంగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్బంగా స్వామి, అమ్మవార్ల వివాహ ఘట్టాన్ని అర్చక పండిత బృందం వేద మంత్రోచ్చరణల మధ్య శాస్త్రయుక్తంగా నిర్వహించారు. లక్షలాది మంది భక్తులు మిథిల స్టేడియంలో కన్నుల పండుగగా జరిగిన సీతారాముల పెళ్లి వేడుకను, మాంగల్యా ధారణ ఘట్టాన్ని తిలకించి పులకించారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు సీతారాములకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి కల్యాణ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్బంగా రూ. 351కోట్లతో చేపట్టునున్న భద్రాచలం దేవాలయం అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఇవి కూడా చదవండి :

Maharashtra Minister Viral Video | ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి… వీడియో వైరల్
Dhurandhar 2 | బాత్‌రూమ్ సీన్‌తో సంచలనం.. మూడు రాత్రులు నిద్ర‌పోలేద‌ట‌

Latest News