గూడ్స్ రైళ్లలో కార్లు, వాహనాలు, ఇతర సరుకులు, వస్తు రవాణా కొనసాగడం సాధారణంగా కొనసాగుతుంది. అప్పుడప్పుడు గూడ్స్ రైళ్లపై వరుస క్రమంలో ట్రాక్టర్లు, కార్లు, జేసీబీ ల లోడ్ వెలుతుండటం కనిపిస్తుంటుంది.అయితే ఓ గూడ్స్ రైలు నిండా సరికొత్త మహీంద్రా ఎస్ యూవీ(SUV) కార్ల లోడ్ తో వెలుతున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ గూడ్స్ రైలులో రవాణా కాబడుతున్న ఒక్కో కారు ధర సుమారు రూ.15-20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తే, ఈ ఒక్క రైలు ద్వారా రూ.400-600 కోట్ల విలువైన కార్లను తరలిస్తున్నట్లు అంచనా వేశారు.
మహీంద్రా & మహీంద్రా కార్ల కంపెనీకి దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలోనూ మంచి మార్కెట్ ఉంది. మహీంద్రా కార్ల కంపెనీ తయారు చేసే కార్లు ధృడమైన, నాణ్యమైన నిర్మాణానికి ప్రఖ్యాతిగాంచాయి. మహీంద్రా బొలెరో, థార్, స్పార్పియో, మహేంద్ర 700ఎస్ యూవీ వంటి కార్ల రకాలకు కార్ల ప్రియులులో ప్రత్యేక డిమాండ్ ఉంది. కంపెనీ మారుతున్న సాంకేతికత, వినియోగదారులు అభిరుచుల మేరకు తన మోడల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ..కొత్త మోడల్స్ ను, ఫేస్ లిఫ్టులను ఆవిష్కరిస్తుంది. మహీంద్రా & మహీంద్రా కంపెనీ తమ సరికొత్త మోడళ్లతో రాబోయే కార్ల లైనప్‌తో భారత ఆటోమొబైల్ మార్కెట్లో దూసుకుపోతోంది. కంపెనీ 2031 నాటికి 16 కొత్త మోడళ్లను (10 ICE వాహనాలు, 6 ఎలక్ట్రిక్ కార్లు) విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇటీవల ప్రముఖ SUV అయిన XUV700 యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మహీంద్రా సరికొత్తగా Mahindra XUV 7XO పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. రాబోయే కొన్ని రోజుల్లో మార్కెట్లోకి మరిన్ని కొత్త మోడల్స్ ను విడుదల చేయనుంది. తాజాగా మహీంద్రా కంపెనీ తయారు చేసిన కొత్త మోడల్ కార్ల లోడ్ లను దేశంలోని వివిధ ప్రాంతాల షో రూమ్ లకు పంపిణీ చేసే క్రమంలో గూడ్స్ రైలులో భారీగా కార్లను కంపెనీ నుంచి డెలివరి పాయింట్లకు రవాణా చేసింది. మహీంద్రా తమ సరికొత్త ‘NU_IQ’ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రాబోయే రోజుల్లో Vision S, Vision X, Vision T, మరియు Vision SXT అనే నాలుగు సరికొత్త SUV కాన్సెప్ట్ మోడళ్లను కూడా ప్రదర్శించింది. ఇవి భవిష్యత్తులో థార్, ఎక్స్‌యూవీ, స్కార్పియో సబ్-బ్రాండ్‌ల కింద మార్కెట్లోకి రానున్నాయి. అలాగే మహీంద్రా థార్ ఈ, మహీంద్రా గ్లోబల్ పిక్ అప్, మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్గ్, పికప్ ట్రక్ ఉన్నాయి.
సరికొత్త మహీంద్రా #SUV లతో నిండిన ఒక పూర్తి రైలు!
ఒక్కో వాహనం ధర సుమారు ₹15-20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తే, ఈ ఒక్క రైలు ద్వారా ₹400-600 కోట్ల విలువైన కార్లను తరలిస్తున్నట్లు అవుతుంది. pic.twitter.com/rlw9FJ8z2r
— UttarandhraNow (@UttarandhraNow) June 26, 2026