శంషాబాద్ విమానశ్రయంలో మరోసారి చిరుత కలకలం

అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌ పరిధిలో మరోసారి చిరుత పులి సంచారం కలకం రేపింది. విమానశ్రయం సమీపంలోని చిన్మయ స్కూల్‌ ప్రాంతంలో ఓ చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.

Reported by: Y.V. Narsimha Reddy | హైదరాబాద్​ | Jun 27, 2026, 2:50 pm IST
Read Time: 2 mins
శంషాబాద్ విమానశ్రయంలో మరోసారి చిరుత కలకలం

అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌ పరిధిలో మరోసారి చిరుత పులి సంచారం కలకం రేపింది. విమానశ్రయం సమీపంలోని చిన్మయ స్కూల్‌ ప్రాంతంలో ఓ చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈమేరకు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

చిరుత సమాచారం అందుకున్న అటవీ అధికారులు, సిబ్బంది చిరుత ఆనవాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అవసరమైతే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన పడకుండా ఏదైనా జంతువు కనిపిస్తే వెంటనే అటవీశాఖ లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.గతంలోనూ శంషాబాద్ విమనాశ్రయం పరిధిలో ఓ చిరుత సంచరించడం తెలిసిందే.