సాధారణ ట్రాఫిక్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్
హైదరాబాద్‌లో సీఎం కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేతపై విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ నుంచి నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణించారు.
పర్యటనలు..ప్రయాణాలతో హైదరాబాద్ నగర రోడ్లపై సామాన్య ప్రజలకు గంటల పాటు ట్రాఫిక్ నిలిపివేత సమస్యలు ఎదురవుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గురువారం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన క్రమంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ప్రయాణించారు.
తన కాన్వాయ్ కోసం సిటీలో వాహనాలను నిలిపివేయవద్దంటూ రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు నిన్న స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లుగా సమాచారం. ప్రజలకు రోడ్లపై ఇబ్బందులు కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారని అధికారవర్గాల కథనం. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు సీఎం కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌లో వాహనాలను అనుమతించారు.
Honourable Chief Minister Sri A. Revanth Reddy’s convoy travelled in regular traffic from Shamshabad Airport to his residence.
The Chief Minister Sri. A. @revanth_anumula had yesterday issued clear instructions to senior police officials against stopping vehicles across the… pic.twitter.com/9nxSh9Crnv
— IPRDepartment (@IPRTelangana) May 7, 2026
ఇవి కూడా చదవండి :
రేవంత్ రెడ్డి పాలన ఢిల్లీకి నజరానా.. రైతులకేమో జరిమానా: హరీశ్ రావు
దిగొచ్చిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి గ్రీన్ సిగ్నల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram