విధాత, హైదరాబాద్ : వికారాబాద్‌లోని అనంతగిరి ఘాట్ రోడ్డులో కారుపై రీల్ చేసినందుకు సోషల్ మీడియా పర్సనాలిటీ ఉప్పల్ బాలుపై విమర్శలు రేగాయి. దీనిపై తాజాగా బాలు స్పందించారు. ‘‘నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్ కోసం రీల్ చేశానని పేర్కొన్నారు. మా బావ కొత్త కారు కొనడంతో అక్కడికి వెళ్లాం. వాహనదారులను ఇబ్బంది పెట్టలేదు. ఇలా చేయడం తప్పయితే.. క్షమించండి’’ అని వివరించారు.
అనంతగిరి రోడ్ల పై ఉప్పల్ బాలు స్టంట్స్.. పర్యాటకులు సిరియస్
అంతకుముందు వికారాబాద్‌లోని ప్రసిద్ధ అనంతగిరి ఘాట్ రోడ్డుపై ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ ఉప్పల్ బాలు చేసిన స్టంట్ వీడియోలు వైరల్‌గా మారాయి. థార్ కారుపై కూర్చొని ప్రమాదకరంగా స్టంట్లు చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఉప్పల్ బాలు తీరు పై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రాన్ని అప్రతిష్టపాలు చేస్తూ వింత చేష్టలకు పాల్పడిన బాలు, నిత్యం వేలాది మంది పర్యాటకులు సందర్శించే ఈ ప్రాంతంలో ఇలాంటి పిచ్చి చేష్టలు, ప్రమాదకర విన్యాసాలు మంచిది కాదని మండిపడుతున్నారు. బాలు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అనంతగిరి రోడ్ల పై ఉప్పల్ బాలు స్టంట్స్.. పర్యాటకులు సిరియస్.
వికారాబాద్‌లోని ప్రసిద్ధ అనంతగిరి ఘాట్ రోడ్డుపై ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ ఉప్పల్ బాలు చేసిన స్టంట్ వీడియోలు వైరల్‌గా మారాయి.
ఉప్పల్ బాలు తీరు పై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది… pic.twitter.com/sHFt7TZjkp
— Telugu Reporter (@TeluguReporter_) June 27, 2026