Wildlife Seizure| శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ వన్యప్రాణుల పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ వన్యప్రాణుల పట్టివేత కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లోకేష్ జయచంద్రన్ అనే ప్రయాణికుడి నుంచి వన్యప్రాణులు స్వాధీనం చేసుకున్నారు

Wildlife Seizure| శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ వన్యప్రాణుల పట్టివేత

విధాత, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో( Shamshabad Airport) విదేశీ వన్యప్రాణుల(Foreign Wildlife Seizure) పట్టివేత కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లోకేష్ జయచంద్రన్ అనే ప్రయాణికుడి నుంచి వన్యప్రాణులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిలో ఒక మానిటర్ బల్లి, రెండు తలల స్పైడర్ తాబేలు ఒకటి, నాలుగు ఆకుపచ్చ ఇగువానాస్, 12 ఇగువాన బల్లులు ఉన్నాయి. ప్రయాణికుడు లోకేష్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.

వన్యప్రాణులను తిరిగి బ్యాంకాక్‌కు తరలించారు. ఆ వన్యప్రాణులను లోకేష్ ఎందుకు తీసుకొచ్చాడన్న కోణంలో కస్టమ్స్ అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. తరుచు స్మగుల్డ్ బంగారం, మద్యం పట్టుబడే శంషాబాద్ విమానాశ్రయంలో ఈ దఫా స్మగుల్డ్ వన్యప్రాణులు పట్టుబడటం కస్టమ్ అధికారులను ఆశ్చర్యపరిచింది.