Gold Silver Price Today : పెరిగిన బంగారం ధరలు..తగ్గిన వెండి !

అంతర్జాతీయ ప్రభావంతో బంగారం ధరలు పెరిగితే, వెండి రూ.10 వేల మేర పడిపోయింది. తాజా బులియన్ మార్కెట్ ధరలపై పూర్తి వివరాలు చదవండి.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Feb 24, 2026, 2:06 pm IST
Read Time: 2 mins
Gold Silver Price Today : పెరిగిన బంగారం ధరలు..తగ్గిన వెండి !

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాట కొనసాగిస్తున్నాయి. బంగారం ధరలు మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాములపై రూ430పెరిగి రూ. 1,61780కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 400పెరిగి రూ. 1,48,300కు చేరింది.

రూ.10వేలు తగ్గిన వెండి ధర

కిలో వెండి ధర మంగళవారం రూ.10,000 తగ్గి రూ. 2,90,000వద్ద కొనసాగుతుంది. అంతకుముందు రోజు మరోసారి రూ.3లక్షల మార్కు కు చేరుకున్న వెండి అనూహ్యంగా మళ్లీ రూ.10వేలు తగ్గడం కొనుగోలుదారులను గందరగోళానికి గురి చేసింది. జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు రూ.4లక్షల 25వేలకు చేరిన వెండి ఆ తర్వాత భారీగా పతనమవ్వడం గమనార్హం. కొంత పుంజుకున్నప్పటికి అస్థిరత కొనసాగుతునే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి 10శాతం సుంకాల పెంపు, ఇరాన్ ఉద్రిక్తతలు, అర్థిక, రాజకీయ పరిణామాల మధ్య బంగారం, వెండి ధరల మధ్య అనిశ్చితి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Hyderabad Cyber Crime : సైబర్ నేరగాళ్లపై ఆక్టోపస్ భారీ ఆపరేషన్
Nani -Sujeeth | నాని–సుజీత్ ‘బ్లడీ రోమియో’ అనౌన్స్‌మెంట్.. డార్క్ క్రైమ్ కామెడీగా స్టైలిష్ ఎంటర్‌టైనర్