Ayodhya Ram Temple | అదిగదిగో అయోధ్య రామాలయం..! శరవేగంగా నిర్మాణ పనులు.. వచ్చే ఏడాది గర్భాలయంలో దర్శనాలు..!
Ayodhya Ram Temple | అయోధ్యలోని శ్రీరాముడి ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. వచ్చే ఏడాది జనవరిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావిస్తున్నది. 2024 సంవత్సరంలో అత్యంత దివ్యమైన, గొప్ప ఆలయంలో రామ్‌లాలా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా.. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆలయ మొదటి అంతస్థు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆలయం వెలుపల […]

Ayodhya Ram Temple |
అయోధ్యలోని శ్రీరాముడి ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. వచ్చే ఏడాది జనవరిలో శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భావిస్తున్నది. 2024 సంవత్సరంలో అత్యంత దివ్యమైన, గొప్ప ఆలయంలో రామ్‌లాలా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా.. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆలయ మొదటి అంతస్థు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఆలయం వెలుపల 8 ఎకరాల్లో పర్కోట నిర్మిస్తున్నారు. గర్భగుడి బయట మంటపం పనులు సాగుతున్నాయి.
ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా మాట్లాడుతూ వచ్చే ఏడాది మకర సంక్రాంతి తర్వాత భక్తులు గర్భాలయంలో మర్యాద పురుషుడు శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకోగలుగుతారన్నారు. మొదటి చైత్ర రామ నవమి నాడు సూర్యకిరణాలు స్వామివారి నుదుటిపై పడతాయని, అందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చ న్నారు. 500 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ అనంతరం ఆలయాన్ని యోగి సర్కారు నిర్మిస్తున్నది.
ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫ్లోర్, లైటింగ్, ఫినిషింగ్ పనులు ఇంకా జరగాల్సి ఉంది. చాలా పనులు పూర్తయ్యాయని, రామ్‌లాలా విగ్రహ ఏర్పాటు పనులు నిర్ణీత సమయంలో పూరవుతాయని పేర్కొన్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ మాట్లాడుతూ.. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఐదు మంటపాలు ఉంటాయని తెలిపారు. మండపం రామమందిరానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు.
ప్రధాన మండపం నుంచే నిత్యం ఆలయంపై జెండాను ఎగురవేయనున్నట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయ్యిందని, ఆలయ గుర్భగుడి గోడ, పైకప్పు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఫోర్లింగ్, వెలుపలి పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉందన్నారు. ఆలయం కింది అంతస్థులో 166 స్తంభాలపై విగ్రహాలు చెక్కే పనులు కొనసాగుతున్నాయన్నారు. దాంతో పాటు ఆలయ గర్భుగడిలో ఆరు స్తంభాలు తెల్లని పాలరాతితో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అయితే, బయటి స్తంభాలు పింక్ ఇసుకరాయితో తయారు చేసినవి వినియోగించున్నట్లు చెప్పారు. డిసెంబర్‌లో రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తిగా సిద్ధమవుతాయని ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. అప్పటి వరకు మొదటి అంతస్తు నిర్మాణం చాలా వరకు పూర్తవుతుందని, 2024 డిసెంబర్ వరకు ఆలయ నిర్మాణం మొత్తం పూర్తవుతుందన్నారు. మిగతా పనులన్నీ 2025 వరకు పూర్తి చేయనున్నట్లు వివరించారు.
2024లో చైత్రమాసం శుక్లపక్షం చైత్ర రామనవమి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీరామనవమి రోజున సరిగ్గా 12 గంటలకు ప్రధాన ఆలయంలో ప్రతిష్ఠించిన రామ్‌లాలా విగ్రహంపై సూర్యకిరణాలు పడతాయని చెప్పారు. ఈ సమయంలో స్వామివారి దర్శనం దివ్యంగా, గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు.
దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలతో కరసత్తు చేస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా.. రామ జన్మభూమిలో అధికారులు నిర్మాణ పనులను పరిశీలించారు. డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్, జిల్లా మెజిస్ట్రేట్ నితీష్ కుమార్, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రాజ్‌కరణ్ నయ్యర్ పనులను పరిశీలించగా.. పనుల పురోగతిని ధర్మకర్త డాక్టర్ అనిల్ మిశ్రా అధికారులకు వివరించారు.