Road Rage In Jaipur | స్కూటీని తాకిందని..బుల్లెట్ బైక్ పై యువతి దాడి!

నా స్కూటీకి డాష్ ఇస్తావా..? అంటూ ఓ యువతి బుల్లెట్ బైక్ పై రాళ్లతో దాడి చేసి విధ్వంసం చేసిన ఘటన వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | ట్రెండింగ్ | Mar 27, 2026, 12:07 pm IST
Read Time: 3 mins
Road Rage In Jaipur | స్కూటీని తాకిందని..బుల్లెట్ బైక్ పై యువతి దాడి!

విధాత, హైదరాబాద్ : నా  స్కూటీకి డాష్ ఇస్తావా..? అంటూ ఓ యువతి బుల్లెట్ బైక్ పై రాళ్లతో దాడి చేసి విధ్వంసం చేసిన ఘటన వైరల్ గా మారింది. జైపూర్‌లో స్కూటీని బుల్లెట్ బైక్ స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో రెచ్చిపోయిన స్కూటీ యువతి వీరంగం సృష్టించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె.. రాళ్లతో బుల్లెట్ బైక్‌పై దాడి చేసి ఒక్కో పార్ట్ ను పగులగొట్టింది.

పోలీసులు, ఇతరులు అక్కడే ఉన్నా ఆమెను వారించే సాహసం చేయలేకపోయారు. బాధిత బుల్లెట్ బైక్ వ్యక్తి తన సమస్యపై సోడాలా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఇరువురికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించివేశారు. అయితే బహిరంగ ప్రదేశంలో యువతి రెచ్చిపోయి ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ఇవి కూడా చదవండి :

ice cream ban Villages| మా ఊరిలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ. 5,000/- జరిమానా.!
petrol diesel excise duty| బిగ్ రిలీఫ్.. పెట్రోట్, డీజిల్ లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు