No Lockdown | లాక్‌డౌన్‌ ఆలోచన లేదు : కేంద్రం స్పష్టీకరణ

పశ్చిమాసియా యుద్దంతో దేశీయంగా నెలకొన్న చమురు, గ్యాస్ సంక్షోభాల నేపథ్యంలో దేశంలో కేంద్రం లాక్ డౌన్ విధించబోతున్నట్లుగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర మంత్రి హర్ధీప్ సింగ్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే ఆలోచన..ప్రతిపాదన ఏది కేంద్ర ప్రభుత్వానికి లేదని, అలాంటి అవసరం లేదన్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 27, 2026, 12:03 pm IST
Read Time: 2 mins
No Lockdown | లాక్‌డౌన్‌ ఆలోచన లేదు : కేంద్రం స్పష్టీకరణ

న్యూఢిల్లీ : పశ్చిమాసియా యుద్దంతో దేశీయంగా నెలకొన్న చమురు, గ్యాస్ సంక్షోభాల నేపథ్యంలో దేశంలో కేంద్రం లాక్ డౌన్ విధించబోతున్నట్లుగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర మంత్రి హర్ధీప్ సింగ్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించే ఆలోచన..ప్రతిపాదన ఏది కేంద్ర ప్రభుత్వానికి లేదని, అలాంటి అవసరం లేదన్నారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న సమయంలో దేశ ప్రజలంతా పరస్పరం ఐక్యంగా ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారాలు వ్యాప్తి చేసి, భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు బాధ్యతారహితం, దేశానికి హానికరమైనవని పేర్కొన్నారు. దేశానికి పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు దేశీయంగా గ్యాస్ ఉత్పత్తులతో పాటు..ప్రత్యామ్నాయా మార్గాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ అనుమతులతో హర్మూజ్ నుంచి 22 నౌకలు రానుండటంతో పాటు రష్యా సహా పలు దేశాల నుంచి ఇంధన నౌకలు భారత్ కు చేరుతున్నాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

ice cream ban Villages| మా ఊరిలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ. 5,000/- జరిమానా.!
petrol diesel excise duty| బిగ్ రిలీఫ్.. పెట్రోట్, డీజిల్ లపై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు