విధాత, హైదరాబాద్ : క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఫోర్లు, సిక్సర్ల జాతర ఐపీఎల్ 2026 సీజన్ టోర్నీ రేపటి నుంచే ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా శనివారం సాయంత్రం 7:30కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌తో 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. లీగ్ స్టేజ్ మే 24న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో ముగియనుంది.
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇంతకుముందు తొలి దశలో కేవలం 20 మ్యాచులకు మాత్రమే వేదికలు, తేదీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో దశలో 50 మ్యాచులకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచులకూ షెడ్యూల్ ప్రకటించినట్లయ్యింది. ఏప్రిల్ 13న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరుతో రెండో దశ ప్రారంభమవుతుంది. టోర్నీకి సంబంధించి కీలకమైన ప్లేఆఫ్స్ వేదికలను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. బెంగళూరులో మే 31న ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి :
Suyodhana Review: ప్రియదర్శి.. ‘సుయోధన’ సినిమా రివ్యూ!
Icecream Ban In Villages | మా ఊరిలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ. 5,000/- జరిమానా.!
