MLA Raja singh | విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రభుత్వానికి దమ్ముంటే.. బీఆర్ఎస్( BRS Party ) అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం( Kaleshwaram ) సహా ఫోన్ ట్యాపింగ్( Phone Tapping ) కేసులను సీబీఐ( CBI ) విచారణకు అప్పగించాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్( MLA Raja Singh ) సవాల్ విసిరారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై ఆధారాలతోసహా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజల ముందుంచారని..కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సీఎం కేసీఆర్ కు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీసహా బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నాయకులంతా మాట్లాడటం జరిగిందని గుర్తు చేశారు. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కాంగ్రెస్ కేసీఆర్ ను రక్షిస్తుందన్న బండి సంజయ్ మాట్లాడిన మాటల్లో తప్పేమి లేదని..ఎవడబ్బ సొమ్ము అని కాళేశ్వరం లాంటి ఫెయిల్ ప్రాజెక్టు కట్టి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని రాజాసింగ్ మండిపడ్డారు. బండి సంజయ్ మాట్లాడింది తప్పనుకుంటే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాసే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ మాట్లాడిన ప్రతి మాట కరెక్ట్…తప్పుంటే ప్రూవ్ చేయండన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సుద్దపూస కాదని..కాళేశ్వరం ప్రాజెక్టుసహా అనేక ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. గత ఎన్నికల సందర్భంగా మోదీ, అమిత్ షా, జాతీయ నాయకులంతా కేసీఆర్ అవినీతిపై మాట్లాడింది నిజం అని రాజాసింగ్ స్పష్టం చేశారు.