Site icon vidhaatha

బీజేపీ లోక్‌సభ ఎన్నికల తెలుగు మ్యానిఫెస్టో విడుదల

మన మోదీ గ్యారంటీ-2024 పేరుతో హామీలు

విధాత : బీజేపీ లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టో తెలుగు వెర్షన్ ‘మన మోదీ గ్యారంటీ 2024 పేరుతో విడుదల చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్‌లు తెలుగు మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతామన్నారు. పంటల బీమా మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు దేశాన్ని మిల్లెట్ హబ్ గా మర్చుతామన్నారు.చేతివృత్తులకు చేయూతనందిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతి పెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు గ్యారంటీతో పాటు మరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఆచ్చే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చామని, పోస్టాఫీసులను మినీ బ్యాంక్ లుగా మార్చేస్తున్నామని, భారత్ ను సర్వీస్ సెక్టార్ హబ్ గా విస్తరిస్తామని అన్నారు. మత్స్యకారులను అన్ని రకాలుగా అదుకుంటామని దేశ భవిష్యత్ కోసమే వన్. నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచన అన్నారు.
ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన న్యాయ పత్రం విభజన రాజకీయాలు చేస్తున్నట్లుగా ఉంటే బీజేపీ సంకల్ప పత్రం చూస్తే వికసిత భారత్ కనిపిస్తుందని ఇదే ఈ రెండు పార్టీల మ్యానిఫెస్టోలకు మధ్య ఉన్న తేడా అన్నారు. గత యూపీఏ ప్రభుత్వ అవినీతి పాలన చూసిన ప్రజలే మోదీకి అవకాశం ఇచ్చారన్నారు. గతంలో అనేక కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన యూపీఏ పేరు మార్చుకుని ఇండియా కూటమిగా రూపం మార్చుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ సంకల్ప్ పత్రం తయారు చేశామన్నారు.

Exit mobile version