Blast in Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 1లోని తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్‌లో కంప్రెసర్ పేలింది. దీంతో అక్కడ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి స్థానికంగా ఉన్న ప్రహరీ గోడ ధ్వంసమైంది. పక్కనే బస్తీలోకి రాళ్లు ఎగిరిపడ్డాయి. దీంతో బస్తీలో నివాసముంటున్న ఓ బాలికకు గాయాలయ్యాయి. బాధిత బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.
Blast in Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు.. బాలికకు గాయాలు..!
