వరికి బోనస్ కోసం బీఆరెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

కాంగ్రెస్ ప్రభుత్వం వరికి క్వింటాల్‌కు 500బోనస్ ఇస్తామని ఎన్నికల్లో హామీనిచ్చి ఇప్పుడు సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామంటూ ప్రకటించడాన్ని నిరసిస్తూ, అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆరెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది

  • Publish Date - May 16, 2024 / 01:50 PM IST

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం వరికి క్వింటాల్‌కు 500బోనస్ ఇస్తామని ఎన్నికల్లో హామీనిచ్చి ఇప్పుడు సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామంటూ ప్రకటించడాన్ని నిరసిస్తూ, అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆరెస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆరెస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఆ పార్టీ శ్రేణులు మండల, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

చెన్నూరు, జనగామ, వరంగల్‌, నల్లగొండ, భువనగిరి, కరీంనగర్‌, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బీఆరెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై రాస్తారోకోలతో నిరసనలు వ్యక్తం చేశారు. ఆందోళనల్లో బీఆరెస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాల్ 500ఇవ్వాల్సిందేనని, లేదంటే రైతాంగంతో కలిసి ఆందోళనలను ఉదృతం చేస్తామని తెలిపారు.

Latest News