BRS Jagadish Reddy| రేవంత్‌ను సీఎంగా చేసిందే మోదీ

బనకచర్లకు అవకాశం ఇస్తున్న తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిందే మోదీ అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీకి సోయి లేదని.. కేవలం తెలంగాణ మూటల కోసం పరితపిస్తున్నాడని విమర్శించారు

విధాత : బనకచర్లకు అవకాశం ఇస్తున్న తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిందే మోదీ అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీకి సోయి లేదని.. కేవలం తెలంగాణ మూటల కోసం పరితపిస్తున్నాడని విమర్శించారు. బుధవారం సూర్యాపేట జిల్లాలోని మోత్కుర్, అడ్డగూడూరు మండల కార్యకర్తల సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. ఉత్తమ్ కి దమ్ముంటే కన్నేపల్లి పంపుహౌజ్ ప్రారంభించాలన్నారు.

12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు పోదామా అని సవాల్ విసిరారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కింద ప్రాజెక్టులు కట్టకుండా ఉండేందుకే.. కాళేశ్వరం కూలిందని.. లక్షకోట్లు పోయాయని దొంగ ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 11 సంవత్సరాల మోదీ పాలనలో తెలంగాణకు చేసిందేమి లేదన్నారు. బీజేపీ.. బీఆర్ఎస్‌లో విలీనం అయినా ఒప్పుకోమని స్పష్టం చేశారు.

కేసీఆర్, కేటీఆర్‌పై బూతు‌లు మాట్లాడుకుండా రేవంత్ రెడ్డి ఉండలేడని విమర్శించారు. హామీలు పక్కదారి పట్టించడం కోసమే తిట్టడం మొదలు పెట్టారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ మంత్రులను సిట్ ఎందుకు పిలవట్లేదని ప్రశ్నించారు. తమిళనాడు‌లో స్టాలిన్, బెంగాల్‌లో మమత మీద రైడ్స్ జరిగితే.. తెలంగాణలో కేసీఆర్ మీద జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ హక్కులను కాపాడుకోవడాని ఎలాంటి త్యాగాలకైనా సిద్దంగా ఉంటామని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.