Site icon vidhaatha

BRS MLC Kavitha | హెచ్‌ఎంఎస్‌ (సింగరేణి) గౌరవాధ్యక్షురాలిగా కవిత

BRS MLC Kavitha | హెచ్ఎంఎస్ అనుబంధ ది సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో నిర్వహించిన హెచ్ఎంఎస్ జనరల్ బాడీ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కవితను సింగరేణి యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకుంటున్నట్టు ప్రతిపాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. కవితను ఇటీవల బీఆరెస్‌ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా తొలగించి ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రెండవ బీఆరెస్‌ నేతగా కవిత గుర్తింపు పొందారు. గతంలో ఈ బాధ్యతలను నాయిని నరసింహా రెడ్డి కూడా నిర్వహించారు.

ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పాత వీఆర్‌ ఎస్ స్కీమ్ పునరుద్ధరించాలని కోరారు. వేలంపాట లేకుండా తెలంగాణ బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించాలని, సింగరేణి కార్మికులకు పెర్క్స్ రీయింబర్స్‌మెంట్‌ కింద ఐటీ రిటర్న్స్ ఇప్పించాలని, సింగరేణిలో అలియాస్ మారుపేరుల సమస్యతో బాధపడుతున్న కార్మికులను వన్ టైం సెటిల్మెంట్ కింద క్రమబద్ధీకరించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో అండర్ గ్రౌండ్ పనులకు అన్‌ఫిట్‌ అయి సర్ఫేస్ ఫిట్ తీసుకున్న సింగరేణి కార్మికునికి బేసిక్ ప్రొటెక్షన్, సూటబుల్ జాబ్ ఇప్పించాలని, కార్మికులకి సొంత ఇంటి పథకం అమలు చేయాలని, సింగరేణిలో పెండింగ్ విజిలెన్స్ కేసులను క్రమబద్ధీకరించాలని తీర్మానం చేశారు. జైపూర్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న భూనిర్వాసితులను రెగ్యులరైజ్ చేయాలని, సింగరేణి కార్మికులకు కంపెనీ లాభాల వాటా 35% ఇప్పించాలని, సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కి కంపెనీ లాభాల్లో 10% వాటా ఇప్పించాలని కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న మహిళలకి వాళ్ళ విద్యార్హతకి తగిన ఉద్యోగాలు కల్పించాలని తీర్మానాల్లో కోరారు.

Exit mobile version