KCR | కేసీఆర్‌ స్వయంకృతం

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వన్‌ ఆర్‌ నన్‌ అనుకున్నారు. కానీ గత ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడినట్లు కనిపిస్తున్నది

  • Publish Date - June 4, 2024 / 12:45 PM IST

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వన్‌ ఆర్‌ నన్‌ అనుకున్నారు. కానీ గత ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్‌ను నిలువరించడం కోసం బీఆర్‌ఎస్‌ లోపాయికారీగా బీజేపీకి మద్దతు తెలిపిందనే విమర్శలున్నాయి. ప్రస్తుత పోలింగ్‌ ట్రెండ్స్‌ను చూస్తే అది నిజమే అనేలా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి బీఆర్‌ఎస్‌ గుణపాఠాన్ని నేర్చకోకపోగా.. గత ఆరు నెలలుగా కేసీఆర్‌, కేటీఆర్‌లు ఓటర్లే తప్పుచేశారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కంటే ఆత్మగౌరవ అంశమే ప్రధాన భూమిక పోషించింది. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు సీఎం అవుతారు? కేసీఆర్‌ స్థాయి నాయకుడు ఎవరు? అనే చర్చను పట్టించుకోలేదు. ఓటమి తర్వాత ఆత్మవిమర్శ చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా దక్కించుకుంటుందా? అంటే కష్టమే అనే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఆపార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడానికి కేసీఆర్‌ వైఖరే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 11 గంటల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పోటా పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం తన ఆధిక్యాన్నినిలబెట్టుకోబోతున్నట్టు స్పష్టమౌతున్నది. బీఆర్ఎస్‌ పార్టీ అన్నిచోట్లా మూడో స్థానంలోనే ఉన్నది. పార్టీల పరంగా అభ్యర్థుల ఆధిక్యం ఈవిధంగా ఉన్నది.

ఖమ్మంలో రామసహాయం రఘురామ్‌రెడ్డి (కాంగ్రెస్‌) 2,56,407
నల్గొండ లో కుందురు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్) 2,44,952
మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ (బీజేపీ) 1, 47,229
మహబూబాబాద్‌లో బలరాం నాయక్‌ (కాంగ్రెస్‌) 1,42,229
కరీంనగర్‌లో బండి సంజయ్‌ (బీజేపీ) 92,350
భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌) 83,585
వరంగల్ లో కడియం కావ్య (కాంగ్రెస్) 77,094
చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బీజేపీ) 61,783
ఆదిలాబాద్‌లో గోడం నగేశ్‌ (బీజేపీ) 47,301
సికింద్రాబాద్: జి కిషన్ రెడ్డి (బీజేపీ) 43,569
హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 38,424
పెద్దపల్లి లో గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 37,171
నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్ (బీజేపీ) 28,969
నాగర్ కర్నూల్ లో మల్లు రవి (కాంగ్రెస్) 24,274
జహీరాబాద్ లో సురేశ్ షెట్కార్ (కాంగ్రెస్) 12,574
మహబూబ్ నగర్ లో డీకే అరుణ (బీజేపీ) 10,714
మెదక్ లో రఘునందన్ రావు (బీజేపీ) 10,714
ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Latest News