గొర్రెల స్కామ్‌లో సీఈవో, ఓఎస్డీల అరెస్టు
విధాత : గొర్రెల స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ తెలంగాణ పశుసంవర్ధకశాఖ సీఈఓ సబావత్ రామ్‌చందర్‌తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ కళ్యాణ్‌కుమార్‌లను అరెస్ట్ చేసింది. రూ.2.10 కోట్ల స్కామ్‌లో రామ్‌చందర్, కళ్యాణ్‌కుమార్ నిందితులుగా ఉన్నారు. వారిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. గొర్రెల స్కామ్‌లో అవినీతికి సంబంధించి గతంలోనూ ఏసీబీ పలువురిని అరెస్టు చేసింది. తాజాగా సీఈవో, ఓఎస్డీల అరెస్టుతో ఈ కేసు విచారణను ఏసీబీ వేగవంతం చేసింది.