Site icon vidhaatha

Talasani: ఏం ఉద్ధరించిందని.. క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు..!

విధాత, హైదరాబాద్: అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరుమార్చడాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పును నిరసిస్తూ శనివారం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఉద్ధరించిందని కేసీఆర్ తెచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెడుతున్నారని ప్రశ్నించారు.

150 క్యాంటీన్లు ఉంటే ఒక్కటి కొత్తగా పెట్టలేదని..ఉన్న వాటిలో 20మూత పడ్డాయని..ఉన్న వాటి క్వాలిటీ చెక్ చేయడం లేదని.. వాటి అభివృద్ధిని పట్టించుకోవడం లేదని తలసాని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ లో పేదలు, యువత, కార్మికుల కోసం కేసీఆర్ గొప్ప మనసుతో రూ.5కే భోజనం అందించేలా అన్నపూర్ణ క్యాంటీన్ లు ఏర్పాటు చేశారన్నారు. పేరు మార్చాలనే ప్రతిపాదన ఉంటే కౌన్సిల్ ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందిరా క్యాంటిన్ల నిర్ణయం మార్చుకోకపోతే ప్రతి క్యాంటీన్ వద్ద ధర్నాలు చేస్తామని హెచ్చరించారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

Exit mobile version